దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్‌లో కప్పు కోసం భారత్‌తో తలపడే ప్రత్యర్థి ఎవరో ఖరారైంది. గురవారం జరిగిన సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి, ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరింది బంగ్లాదేశ్. ఆదివారం జరిగే తుదిపోరులో గెలిచిన జట్టు.. విజేతగా నిలవనుంది.
పోచ్స్ట్రోమ్ వేదికగా గురువారం జరిగిన సెమీస్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని 44.1 ఓవర్లలోనే ఛేదించి, 6 వికెట్ల తేడాతో గెలిచింది యువ బంగ్లా. మహ్మదుల్ హసన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
-
Those moves 🙌🙌🙌#U19CWC | #NZvBAN | #FutureStars pic.twitter.com/odtDlftTQS
— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Those moves 🙌🙌🙌#U19CWC | #NZvBAN | #FutureStars pic.twitter.com/odtDlftTQS
— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020Those moves 🙌🙌🙌#U19CWC | #NZvBAN | #FutureStars pic.twitter.com/odtDlftTQS
— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020
అంతకు ముందు మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో దాయది పాకిస్థాన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది యువ భారత్. ఈ టోర్నీలో ఏడోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది.