బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్ మోమినుల్ హక్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం అతడు హోమ్ క్వారంటైన్లో ఉన్నాడని ఓ స్థానిక వార్తా నివేదిక తెలియజేసింది. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఛీఫ్ ఫిజిషియన్ డాక్టర్ దేబాషిష్ చౌదరి ధ్రువీకరించారు.
మోమినుల్‌కు మహమ్మారి సోకడం వల్ల మరో సీనియర్ ఆటగాడు మహ్మదుల్లా రియాద్‌పై ప్రభావం పడింది. దీంతో అతడు పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్లే-ఆఫ్స్‌లో పాల్గొనే అవకాశం లేదు.
"గత రెండు రోజులుగా నాకు జ్వరంగా ఉంది. కరోనా పరీక్ష చేయగా అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం జ్వరం తప్ప.. ఇతర లక్షణాలేవి కనిపించడం లేదు" అని మోమినుల్ హక్ తెలిపాడు. దీంతో ఈ నెల చివర్లో జరగాల్సిన బంగాబందు టీ20 లీగ్‌లో ఈ కెప్టెన్ పాల్గొనడం సందేహంగా మారింది.
బంగ్లా క్రికెటర్లలో మష్రాఫ్ మోర్తాజా, అబూ జయెద్, సైఫ్ హసన్‌లు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.