బంగ్లాదేశ్ మాజీ సారథి షకిబుల్ హసన్... రెండేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). తనను ఓ బుకీ సంప్రదించినా ఆ విషయాన్ని దాచి పెట్టడమే ఇందుకు కారణం.
ఏ క్రికెటరైనా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఆటకు దూరమైతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ప్రస్తుతం షకిబుల్ అదే పనిలో ఉన్నట్లున్నాడు.
ఇటీవలే ఢాకా వేదికగా ఫూటీ హ్యాగ్స్, కొరియన్ ఎక్స్‌పాట్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో షకిబ్.. ఆటగాడిగా బరిలోకి దిగాడు. ఫూటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

"ఆర్మీ స్టేడియంలో కొరియన్ ఎక్సపాట్ జట్టుకు ప్రత్యర్థులుగా మేము(ఫూటీ హ్యాగ్స్) 11 మందితో బరిలోకి దిగాం. 3-2 తేడాతో గెలిచాం. ఫూటీ హ్యాగ్స్ తరఫున షకీబ్ అడటం ఆనందంగా ఉంది"
-- ఫూటీ హ్యాగ్స్ పోస్టు
ప్రపంచ ఆల్‌రౌండర్ల జాబితాలో ప్రస్తుతం తొలిస్థానంలో ఉన్నాడు షకిబ్. రెండేళ్ల నిషేధం కారణంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. భారత్‌తో టీ20, టెస్టు సిరీస్‌కు ఈ క్రికెటర్ లేకుండానే బరిలోకి దిగింది బంగ్లాదేశ్ జట్టు.
ఇరుజట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా ఆదివారం(నవంబర్ 10న) జరగనుంది.
నవంబర్ 14-19(ఇండోర్), 22-26(ఈడెన్ గార్డెన్స్)లలో రెండు టెస్టులు జరగనున్నాయి. కోల్‌కతాలో తొలిసారి డే/నైట్ టెస్టు ఆడనున్నాయి ఇరుజట్లు.