కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న క్రీడా టోర్నీలపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్.. కొద్దికాలంలోనే ఇతర దేశాలకు వ్యాపించింది. దక్షిణ ఆసియా దేశాల్లోనూ (కొవిడ్-19) కేసులు నమోదయ్యాయి. మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020 మ్యాచ్లు ఎలాంటి అడ్డంకి లేకుండా సాగిపోతున్నాయి. అయితే బంగ్లాదేశ్, జింబాబ్వే మొదటి టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల అమ్మకాలు పరిమితం చేసి.. వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని బంగ్లా నిర్ణయించింది.
నిపుణులు తెలిపిన విధంగా బహిరంగ సభలను నివారించటానికి బీసీబీ తన వంతు చర్య తీసుకుంది. ఈ ఒక్క మ్యాచ్ తప్ప.. ఆ దేశంలో జరిగే ఇతర మ్యాచ్ల గురించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయితే తదుపరి మ్యాచ్ల కోసం ప్రణాళికలు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాదేశ్ వేదికగా ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్ల సిరీస్ ఈ నెలాఖరులో జరగవచ్చని సమాచారం.
తాజాగా బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ శతాబ్ద జయంతి సందర్భంగా ఒక కచేరీ జరగనుంది. ఈ కార్యక్రమానికి హంగు ఆర్భాటాలేవి లేకుండా సాధారణంగా ఉత్సవాలు జరపాలని ఆ దేశం నిర్ణయించినట్టు సమాచారం.
ఇదీ చూడండి.. 'షెఫాలీ కంటతడి పెట్టుకోవడం చూడలేకపోయా'