ETV Bharat / sports

చెపాక్​ను చుట్టేసేదెవరు? తొలి పోరులో హిట్టయ్యేదెవరు? - ఇండియా vs ఇంగ్లాండ్​ టెస్ట్ మ్యాచ్ 1

చెన్నై వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు అంతా సిద్ధమైంది. కెప్టెన్‌ కోహ్లీ జట్టులోకి తిరిగి రావడం, స్వదేశంలో ఆడుతుండటం టీమ్​ఇండియాకు కలిసివచ్చే అంశం. ఉదయం 9:30 గంటల నుంచి మ్యాచ్​ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

india
భారత్​-ఇంగ్లాండ్​
author img

By

Published : Feb 5, 2021, 5:30 AM IST

దాదాపు ఏడాది తర్వాత భారత్​లో క్రికెట్ సందడి మొదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం(ఫిబ్రవరి 5) నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో కీలక సిరీస్​ జరగనుంది. చెన్నై వేదికగా భారత్​-ఇంగ్లాండ్​ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరేందుకు ఇరు జట్లకు ఈ సిరీస్‌ ఎంతో కీలకం.

ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి, చారిత్రక విజయం సాధించిన టీమ్ఇండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లాండ్.. అదే ఉత్సాహంతో‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. దీనికి తోడు ఫ్యాబ్‌ ఫోర్‌గా పిలుచుకునే జాబితాలోని కోహ్లీ, రూట్‌ తమ తమ జట్లకు సారథ్యం వహిస్తుండడం వల్ల ఈ సిరీస్‌ క్రికెట్‌ అభిమానులకు అసలైన మజాను పంచనుంది. చెన్నై పిచ్‌ మొదటి రోజు బౌన్స్‌కు సహకరిస్తే మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. దీంతో ఇరుజట్లకు స్పిన్నర్ల ఎంపిక కీలకంగా మారనుంది.

టీమ్​ఇండియా బలాలు, బలహీనతలు

పితృత్వ సెలవు పూర్తి చేసుకుని కెప్టెన్‌ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం టీమ్​ఇండియా బలాన్ని పెంచింది. గిల్‌, పంత్‌ లాంటి యువకులతో పాటు పూజారా, రహానె, రోహిత్‌ లాంటి అనుభవజ్ఞులతో జట్టు సమతూకంగా ఉంది. ఆస్ట్రేలియాలోని బౌన్సీ ట్రాక్‌లపై బెరుకు లేకుండా బ్యాటింగ్‌ చేసిన మెన్ ఇన్ బ్లూ.. బ్యాట్స్‌మెన్‌కు సహకరించే చెన్నై పిచ్‌పై ఎన్ని అద్భుతాలు చేస్తారో చూడాలి.

బౌలింగ్‌ కూర్పు విషయంలో సెలక్టర్లకు తలనొప్పి ఎదురవుతోంది. మొదటి పేసర్‌గా బుమ్రా ఎంపిక ఖాయమవగా, రెండో పేసర్‌గా ఇషాంత్‌ శర్మకు మహ్మద్‌ సిరాజ్‌ గట్టి పోటీనిస్తున్నాడు. ఆసీస్‌ సిరీస్‌లో సీనియర్ల గైర్హాజరీతో సిరాజ్‌ బౌలింగ్‌ బాధ్యతలను మోసి ప్రశంసలు అందుకున్నాడు. స్పిన్నర్ల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉండగా అనుభవం రీత్యా అశ్విన్‌కు చోటు పక్కా. సుందర్‌కు అక్షర్‌ పటేల్‌ నుంచి పోటీ ఎదురవుతోంది. గత సిరీసులో చోటివ్వని చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు అవకాశమిచ్చే అంశంపై గందరగోళం నెలకొంది.

ఇంగ్లాండ్​ బలాలు, బలహీనతలు

ఇంగ్లాండ్‌ జట్టులో కెప్టెన్‌ రూట్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఉపఖండం పిచ్‌లపై స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే శ్రీలంకలో రూట్‌ నిరూపించాడు. అతడితో పాటు ఇంగ్లాండ్‌ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. అనుభవజ్ఞుడైన జేమ్స్‌ అండర్సన్‌, కొత్తబంతితో భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసరనున్నాడు. జోఫ్రా ఆర్చర్‌, సువర్ట్‌ బ్రాడ్‌ లతో ఆ జట్టు పేస్‌ దళం బలంగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పిలిచే బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌తో, బంతితో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగలడు. స్పిన్‌ బౌలింగ్‌లో అనుభవ లేమితో కనిపిస్తోంది. ఆఫ్‌ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌, లెఫ్టార్మ్‌ సిన్నర్‌ జాక్‌ లీచ్‌తో ఇంగ్లాండ్‌ బరిలో దిగుతోంది. ఉపఖండ పిచ్‌లపై చెలరేగి ఆడే భారత బ్యాట్స్‌మెన్‌పై వీరిద్దరు ఆధిపత్యం చెలాయించడం కష్టమేనని క్రీడా పండితులు అంటున్నారు.

ఫైనల్​కు అర్హత సాధించాలంటే

ఈ సిరీస్‌తో కివీస్‌తో ఫైనల్‌లో తలపడే జట్టేదో తేలనుందని ఐసీసీ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. కోహ్లీ సేన ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్​.. 2-0, 2-1, 3-0, 3-1 లేదా 4-0 తేడాతో సిరీస్‌ గెలిచి తీరాలి. భారత్‌ 1-0తో సిరీస్‌ గెలిచినా.. 2-2, 1-1తో డ్రా చేసుకున్నా ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఇంగ్లాండ్ చేరాలంటే టీమ్ఇండియా 3-0, 3-1 లేదా 4-0 తేడాతో గెలవాలి.

షెడ్యూల్​

భారత్‌, ఇంగ్లాండ్‌.. ఈ పర్యటనలో భాగంగా 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేల్లో తలపడనున్నాయి. తొలి రెండు టెస్టులకు చెన్నై, తర్వాతి రెండు టెస్టులకు అహ్మదాబాద్ మోతెరా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మూడో టెస్టు గులాబి బంతితో డే/నైట్‌లో జరగనుంది. ఐదు టీ20లకూ మోతెరానే వేదిక. వన్డే సిరీస్‌ మొత్తం పుణెలో నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: 'అశ్విన్​ను ఎదుర్కోవడమంటే యుద్ధం చేసినట్లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.