పాకిస్థాన్ యువ ఆటగాడు బాబర్ ఆజామ్ రికార్డు సృష్టించాడు. కరాచీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేశాడు ఆజామ్. ఫలితంగా వన్డేల్లో అత్యంత వేగంగా 11 సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీని అధిగమించాడు. బాబర్ 71 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. కోహ్లీకి 82 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. తొలి రెండు స్థానాల్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నిలిచారు. ఆమ్లా 64 ఇన్నింగ్స్‌ల్లో, డికాక్ 65 ఇన్నింగ్స్‌ల్లోనే 11 శతకాలు పూర్తి చేశారు.
బాబర్ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో ఏడాది కాలంలో వెయ్యి పరుగులు చేసిన తొలి పాక్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 1000 పరుగులు పూర్తి చేయడానికి బాబర్ 19 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
2009 లాహోర్ దాడి తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఏ దేశమూ ముందుకు రాలేదు. ఇప్పటివరకు దుబాయ్ వేదికగా పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతూ వస్తోంది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను పాక్‌కు పంపేందుకు అంగీకరించగా.. తమ భద్రత నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపలేదు. జూనియర్ ఆటగాళ్లను పంపించింది. ఈ పర్యటనలో తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది.
ఇవీ చూడండి.. 17తో నాకు ఏదో సంబంధం ఉంది: రహానె