ప్రాణాంతక కరోనాను అరికట్టటంలో భాగంగా సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు తమ వంతు సాయమందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన వంతు విరాళం అందించేందుకు ముందుకొచ్చాడు పాకిస్థాన్ క్రికెటర్ అజహర్ అలీ. వెస్టిండీస్‌పై త్రిశతకం చేసిన బ్యాట్, ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచినప్పటి జెర్సీని ఈ వేలంలో ఉంచాడు. వాటి కనీస ధర రూ.10 లక్షలుగా నిర్ణయించాడు. అందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు.
-
I put 2 of my closest belongings on auction with base price of 1 million PKR each to support People suffering due to ongoing crisis. Auction starts now & will close on 11:59PM 05May20. To place bid, text/whatsapp on +923228485173, or msg on my twitter. pic.twitter.com/7BJviamP88
— Azhar Ali (@AzharAli_) April 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I put 2 of my closest belongings on auction with base price of 1 million PKR each to support People suffering due to ongoing crisis. Auction starts now & will close on 11:59PM 05May20. To place bid, text/whatsapp on +923228485173, or msg on my twitter. pic.twitter.com/7BJviamP88
— Azhar Ali (@AzharAli_) April 28, 2020I put 2 of my closest belongings on auction with base price of 1 million PKR each to support People suffering due to ongoing crisis. Auction starts now & will close on 11:59PM 05May20. To place bid, text/whatsapp on +923228485173, or msg on my twitter. pic.twitter.com/7BJviamP88
— Azhar Ali (@AzharAli_) April 28, 2020
"నాకు ఎంతో ఇష్టమైన రెండు వస్తువులు వేలానికి పెడుతున్నా. ఇందులో ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలోని జట్టు సభ్యుల సంతకాలతో కూడిన జెర్సీ ఉంది. ఈ రెండింటి ప్రాథమిక ధరను రూ.1 మిలియన్ పాకిస్థానీ రూపాయలుగా నిర్ణయించా. మే 5 వరకు వేలం కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చిన డబ్బును కొవిడ్-19 కట్టడికి వినియోగిస్తా" -అజహర్ అలీ, పాక్ క్రికెటర్
2016లో యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన డే అండ్ నైట్ టెస్టులో త్రిశతకం చేశాడు అజహర్ అలీ. తద్వారా ఈ ఫార్మాట్లో తొలి త్రిశతకం చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.