భారత్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే అదరగొట్టాడు. మొత్తం 27 వికెట్లు పడగొట్టి.. భారత మాజీ ఆటగాడు దిలీప్ దోషీ రికార్డును సమం చేశాడు.
దిలీప్ ఆరు మ్యాచుల్లో 27 వికెట్లు తీయగా.. అక్షర్ కేవలం 3 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టుతోనే సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడీ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. మూడో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు.
చివరి టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 27 వికెట్లతో తొలి సిరీస్‌నే చిరస్మరణీయంగా మలుచుకున్నాడు.
అశ్విన్ 30వ సారి..
మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పలు ఘనతలు సొంతం చేసుకున్నాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఫీట్ చేయడం అశ్విన్‌కు ఇది 30వ సారి. సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టిన అతడికే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.
ఇంకా.. 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు రెండు టెస్టు సిరీస్‌ల్లో పడగొట్టిన ఏకైక భారత బౌలర్ అశ్వినే.
ఇదీ చూడండి: ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్