ETV Bharat / sports

'ఫార్మాట్​తో సంబంధం లేకుండా మెరుగవ్వాలి' - లబుషేన్​ లేటెస్ట్​ న్యూస్​

క్రికెట్​లో ఫార్మాట్​తో సంబంధం లేకుండా తన ఆటతీరు మెరుగుపరుచుకోవాలని అంటున్నాడు ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ లబుషేన్​. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సాధన చేస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Australia's Labuschagne wants to become man-for-all-formats
'ఫార్మాట్​తో సంబంధం లేకుండా ఆటతీరు మెరుగవ్వాలి'
author img

By

Published : Aug 20, 2020, 10:19 AM IST

ఫార్మాట్​తో సంబంధం లేకుండా క్రికెట్​లో తన ఆటను మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు ఆస్ట్రేలియా మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​​ లబుషేన్​. వన్డేల్లో తన బౌలింగ్​ నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకుంటానని వెల్లడించాడు.

"మనం బాగా ఆడాలని కోరుకుంటే ఫార్మాట్​తో సంబంధం లేదు. వన్డేల్లో నా ఆటతీరు ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. నా బౌలింగ్​ స్థిరంగా ఉండేలా చూడాలి. దీనివల్ల బ్యాటింగ్​లో విఫలమైనా.. బౌలింగ్​ ద్వారా మిడిల్ ఓవర్లలో కెప్టెన్​కు ఉత్తమ ఎంపికగా ఉండాలనుకుంటున్నా. దాని కోసం మరింత సాధన చేయాలి. అలాంటి నైపుణ్యాలను నాలో వృద్ధి చేసుకోవడానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండటం చాలా ఆనందంగా ఉంది. మనకున్న సమయాన్ని తెలివిగా ఉపయోగించడంపైనే మన ఆటతీరు పూర్తిగా ఆధారపడి ఉంటుంది".

- లబుషేన్​, ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​

జట్టులో నాయకత్వ లక్షణాల గురించి లబుషేన్​ వద్ద ప్రస్తావించగా.."నాయకుడిగా ఉండటానికి నేను ఇష్టపడతా. కానీ, అది ఇప్పుడు అవసరమని నేను అనుకోను. నా పని కేవలం ఆస్ట్రేలియా తరపున నిలకడగా ఆడుతూ పరుగులు సాధించడమే" అని తెలిపాడు.

Australia's Labuschagne wants to become man-for-all-formats
లబుషేన్​ టెస్టు కెరీర్​

సెప్టెంబరు 4 నుంచి ఇంగ్లాండ్​తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది ఆస్ట్రేలియా. ఏగాస్​ బౌల్​లో టీ20లను, ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా వన్డేలను నిర్వహించనున్నారు.

ఈ సిరీస్​ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆగస్టు 24న ఇంగ్లాండ్​ బయలుదేరి వెళ్లనున్నారు. ఇంగ్లాండ్​తో మూడు టీ20ల ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా 50 ఓవర్ల ఇంట్రా-స్క్వాడ్​ ప్రాక్టీస్ గేమ్​, మూడు టీ20 ప్రాక్టీస్ మ్యాచ్​లను ఆడనుంది. సెప్టెంబరు 4,6,8 తేదీల్లో టీ20లను నిర్వహించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.