ETV Bharat / sports

ఇంగ్లాండ్​- ఆస్ట్రేలియా సిరీస్​ ప్రారంభం అప్పుడే!

ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్​ పర్యటనకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సిరీస్​లో మూడు టీ20లు, వన్డేలు జరగనున్నాయి. సెప్టెంబర్ 4న సిరీస్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

author img

By

Published : Jul 20, 2020, 1:04 PM IST

Australia's "bio-secure" tour of England comprising three T20s and as many ODIs will begin on September 4
ఇంగ్లాండ్​- ఆస్ట్రేలియా సిరీస్

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో దాదాపు 6నెలల పాటు నిలిచిపోయిన క్రికెట్​ కార్యకలాపాలు పునఃప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే బయో సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించే మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్​​ల కోసం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్​ పర్యటనకు సిద్ధమైంది. సెప్టెంబరు 4న తొలి మ్యాచ్​ జరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలియజేశాయి.

మాంచెస్టర్​లోని సౌతాంప్టన్, ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా ఈ సిరీస్​ను నిర్వహించే అవకాశం ఉంది. దీనికోసం ఆసీస్ జట్టు ప్రైవేట్​ విమానంలో ఇంగ్లాండ్​కు చేరుకోనుంది. పర్యటనలో మొత్తం ఆరు మ్యాచ్​లు జరగనున్నాయి.​ సెప్టెంబరు 4,6,8 తేదీల్లో టీ20లు, 10,12,15 తేదీల్లో వన్డేలను నిర్వహించనున్నట్లు స్థానిక పత్రిక తెలిపింది.

అయితే ఈ పర్యటనపై ఆస్ట్రేలియా క్రికెట్​ జాతీయ జట్టు చీఫ్​ బెన్​ ఓలివర్​ స్పందిస్తూ... ఇంగ్లాండ్​లో ఆసీస్​ ఆటగాళ్లు ఎదుర్కొనే ఆంక్షల ఆధారంగా ఈ పర్యటనపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. "ఆటగాళ్లు, సిబ్బంది, తదితరులకు వైద్యపరమైన భద్రత చాలా కీలకం. క్వారంటైన్​కు సంబంధించిన ఏర్పాట్లపై వారు ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు." అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్​ జట్టు వెస్టిండీస్​తో తలపడుతోంది. కరోనా తర్వాత నిర్వహించిన తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం గమనార్హం. అనంతరం పాకిస్థాన్​తో తదుపరి సిరీస్​ ఆడనుంది ఇంగ్లీష్​ జట్టు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.