ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించింది టీమ్ఇండియా. ఆసీస్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసి 53 పరుగుల ఆధిక్యంలో నిలిచింది భారత్. కంగారూ జట్టు ఇలా తక్కువ స్కోరుకే పరిమితమవడంపై తాజాగా స్పందించాడు ఆ దేశ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తక్కువ అంచనా వేశారని తెలిపాడు.
"అశ్విన్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు దాటిగా ఆడదామని ప్రయత్నించారు. అశ్విన్ మంచి బౌలర్ అన్న విషయం మరిచి అతడిని తక్కువ అంచనా వేశారు."
-పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. కీలక ఆటగాడు స్టీవ్ స్మిత్‌తో పాటు మొత్తం నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు.