రాజ్కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండో మ్యాచ్లోనూ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. భారత తుది జట్టులో పంత్ గాయంతో తప్పుకోగా.. మనీశ్ పాండేకు చోటు దక్కింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది ఆసీస్ జట్టు.
రాజ్కోట్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశముంది. అయితే ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోవడం గమనార్హం.
భారత్:
ధావన్, రోహిత్, రాహుల్(కీపర్), కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్, మనీశ్ పాండే, జడేజా, కుల్దీప్, షమి, బుమ్రా, సైనీ
ఆస్ట్రేలియా:
వార్నర్, ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, లబుషేన్, టర్నర్, కేరీ, అగర్, కమిన్స్, స్టార్క్, కేన్ రీచర్డ్సన్, ఆడం జంపా.