ETV Bharat / sports

ఏ స్థానంలోనైనా ఆడతా: లబుషేన్​

author img

By

Published : Dec 13, 2020, 7:55 AM IST

Updated : Dec 13, 2020, 8:34 AM IST

భారత్​తో జరిగే తొలి టెస్టులో మొదటి మూడు స్థానాల్లో ఎక్కడ ఆడడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు ఆసీస్​ క్రికెటర్​ మార్నస్​ లబుషేన్​. అయితే ప్రస్తుతం తన స్థానంపై ఎలాంటి చర్చ జరగట్లేదని చెప్పాడు.

Labuschagne
లబుషేన్​

ఒకటి నుంచి మూడు వరకు ఏ స్థానంలో ఆడడానికైనా తాను సిద్ధమని ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ మార్నస్​ లబుషేన్​ చెప్పాడు. డేవిడ్​ వార్నర్​, పకోస్కీలు ఇద్దరూ తొలి టెస్టుకు దూరం కావడంతో పాటు జో బర్న్స్​ అంతగా ఫామ్​లో లేని నేపథ్యంలో ఆస్ట్రేలియా లబుషేన్​ ఓ ఓపెనింగ్​ ప్రత్యామ్నాయం. అయితే జట్టుతో తన స్థానంపై ఎలాంటి చర్చ జరగట్లేదని అతడు చెప్పాడు.

"నా బ్యాటింగ్​ స్థానంపై జట్టులో ఎలాంటి చర్చ జరగట్లేదు. ప్రస్తుతం నాది మూడో స్థానం అనుకుంటున్నా. అయినే నేను 1 నుంచి మూడో స్థానం వరకు ఎక్కడ ఆడడానికైనా సిద్ధంగా ఉన్నా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంతిని ఎదుర్కోవడానికి నేను సిద్ధం" అని లబుషేన్​ చెప్పాడు.

ఆసీస్​ జట్టులో హారిస్​

భారత్​తో తొలి టెస్టు కోసం గాయపడ్డ విల్​ పకోస్కి స్థానంలో మార్కస్​ హారిస్​ ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా-ఏ తరఫున భారత్​-ఏతో ప్రాక్టీస్​ మ్యాచ్​లో ఆడుతూ పకోస్కి కంకషన్​కు గురయ్యాడు. హారిస్​ ఇంతకముందుకు 9 టెస్టులు ఆడాడు. పకోస్కి, వార్నర్​ రెండో టెస్టు సమయానికి కోలుకుంటారని క్రికెట్​ ఆస్ట్రేలియా ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి : సచిన్ పేరు మీద స్టేడియం.. భాజపా ఎంపీ వెల్లడి

Last Updated : Dec 13, 2020, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.