భారత్‌తో త్వరలో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ఉదయం తమ జట్టును ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులను ఎంపిక చేయగా అందులో ఐదుగురు కొత్త క్రికెటర్లకు అవకాశం కల్పించింది. కరోనా నేపథ్యంలో బయోబబుల్ పరిస్థితుల కారణంగా అదనంగా ఈ యువ ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ కొత్త క్రికెటర్లలో విల్ పుకోవిస్కి(Will Pucovski) అనే విక్టోరియా టీమ్ (ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు) ఓపెనర్‌ను ఎంపిక చేయడమే అసలు విశేషం. అతడు షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ద్విశతకాలు బాది 495 పరుగులు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీ అతడిని డేవిడ్ వార్నర్‌కు జోడీగా పనికొస్తాడని రెండో ఓపెనర్‌గా ఎంపిక చేసింది. మరోవైపు వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టులోని కామరూన్ గ్రీన్‌ను కూడా ఎంపిక చేశారు. అతడు కూడా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటాడు. టిమ్‌పైన్ సారథ్యంలో ఆస్ట్రేలియా డిసెంబర్ 17 నుంచి కోహ్లీసేనతో టెస్టు సిరీస్ ఆడనుంది. అంతకుముందు ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి.
-
JUST IN: Australia have announced their Test squad to face India #AUSvIND
— cricket.com.au (@cricketcomau) November 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Full details: https://t.co/naLfIBuML4 pic.twitter.com/R2zhIR7X0m
">JUST IN: Australia have announced their Test squad to face India #AUSvIND
— cricket.com.au (@cricketcomau) November 12, 2020
Full details: https://t.co/naLfIBuML4 pic.twitter.com/R2zhIR7X0mJUST IN: Australia have announced their Test squad to face India #AUSvIND
— cricket.com.au (@cricketcomau) November 12, 2020
Full details: https://t.co/naLfIBuML4 pic.twitter.com/R2zhIR7X0m
ఆస్ట్రేలియా టెస్టు జట్టు: టిమ్‌పైన్(కెప్టెన్), జేమ్స్ పాటిన్‌సన్, విల్ పుకోవిస్కి, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్‌సన్, మాథ్యూవేడ్, డేవిడ్‌వార్నర్, సీన్ అబ్బాట్, జోబర్న్స్, పాట్ కమిన్స్, కామరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మైఖేల్ నాసర్.
భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, శుభ్‌మన్‌గిల్, వృద్ధిమాన్ సాహా, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైని, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్
ఇవీ చదవండి: