ETV Bharat / sports

నేను ధోనీ అంత స్పీడ్ కాదులే: ఆసీస్​ కీపర్​ - shikar dhawan stump out second t20

టీమ్​ఇండియాతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా తాత్కాలిక సారథి మాథ్యూ వేడ్​.. భారత బ్యాట్స్​మన్​ శిఖర్​ ధావన్​ను స్టంపౌట్​ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ సమయంలో అతడు శిఖర్​తో ఓ మాట అన్నాడు. అది కాస్త వైరల్​గా మారింది. ఇంతకీ ఏమన్నాడంటే?

sikhar
శిఖర్​
author img

By

Published : Dec 7, 2020, 11:43 AM IST

ఆదివారం జరిగిన రెండో టీ20లో.. టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ శిఖర్​ ధావన్​- ఆస్ట్రేలియా​ వికెట్​ కీపర్​ మాథ్యూ వేడ్​ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

ఏం జరిగిందంటే?

ఈ మ్యాచ్‌లో ధావన్‌ను స్టంపౌట్ చేసే అవకాశాన్ని వేడ్ చేజార్చాడు. స్పిన్నర్ స్వెప్సన్ బౌలింగ్‌లో ఓ కాలు క్రీజు బయట పెట్టిన గబ్బర్​ బంతిని కట్ చేయబోయాడు. కానీ అది చాలా దూరంగా వెళ్లడం వల్ల షాట్ మిస్సయ్యాడు. ఈ క్రమంలోనే అతడు బ్యాలెన్స్ కోసం క్రీజు లోపల ఉంచిన పాదాన్ని పైకి లేపగా.. వికెట్ల వెనుక ఉన్న వేడ్ .. వెంటనే బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. కానీ అప్పటికే ధావన్ క్రీజులో పాదాన్ని మోపాడు.

39 పరుగుల వద్ద గబ్బర్​ను ఔట్ చేసే అవకాశాన్ని జారవిడిచిన వేడ్.. "రెప్పపాటులో స్టంపౌట్ చేయడానికి నేను ధోనీని కాదు" అని శిఖర్‌తో నవ్వుతూ అన్నాడు. బదులుగా ధావన్ కూడా నవ్వుతూ కనిపించాడు.

ఈ పోరులో గెలిచిన టీమ్​ఇండియా మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే సిరీస్​ను కైవసం చేసుకుంది. డిసెంబర్​ 8వ తేదీన నామమాత్రపు మూడో టీ20లో ఇరుజట్లు తలపడనున్నాయి.

ఇదీ చూడండి : 'పాండ్యలో ఇప్పుడే మరో ధోనీని చూశా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.