పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలిటెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్థితిలో నిలిచింది. గబ్బా వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో రెండు రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 312 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (151, 265 బంతుల్లో) శతకంతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ జోయ్ బర్న్స్ 97 పరుగులు చేసి కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైన పాకిస్థాన్.. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమించింది. నిలకడగా ఆడిన వార్నర్, బర్న్స్ తొలి వికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వార్నర్ విధ్వంసం సృష్టించి శతకం సాధించగా.. సెంచరీకు మూడు పరుగుల ముందు యాసిర్ షా బౌలింగ్‌లో బర్న్స్ (97) ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మార్నస్ లబుషేన్ (55) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
18 ఇన్నింగ్స్‌ల తర్వాత వార్నర్ సెంచరీ
ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన వార్నర్ ఈ మ్యాచ్‌లో సత్తాచాటాడు. అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. 18 ఇన్నింగ్స్‌ల తర్వాత వార్నర్ సెంచరీ చేశాడు. నిలకడగా ఆడి కెరీర్లో 22వ సారి వంద పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 265 బంతుల్లో 151 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.
యాషెస్ సిరీస్‌లో మొత్తం పది ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ 2,8,3,5,61,0,0,0,5,11 వరుస పరుగులివి. హెడింగ్లీలో మాత్రమే అర్ధశతకం (61) చేశాడు. వార్నర్ ఆ సిరీస్ మొత్తం 9.5 సగటుతో 95 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.

తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 240 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఒక్క వికెటే కోల్పోయి.. 72 పరుగుల ఆధిక్యంలో నిలిచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో వార్నర్, లబుషేన్ ఉన్నారు.
ఇదీ చదవండి: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. భారత్ బౌలింగ్