ETV Bharat / sports

వచ్చే నెల నుంచి దేశవాళీ టోర్నీలు ప్రారంభం!

జూన్​ 6 నుంచి దేశవాళీ క్రికెట్​ టోర్నీలను ప్రారంభించనున్నట్లు తెలిపింది క్రికెట్​ ఆస్ట్రేలియా. అయితే బంతిపై ఉమ్ము, చెమటను రాయడాన్ని నిషేధించడం సహా మరికొన్ని నిబంధనలను ఆటగాళ్లు కచ్చితంగా పాటించాలని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

Australia Indigenous tournaments are begin in next month
వచ్చే నెల నుంచి దేశవాళీ టోర్నీలు ప్రారంభం!
author img

By

Published : May 18, 2020, 9:22 AM IST

కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్‌ కార్యకలాపాలన్నీ నిలిపి వేసిన ఆస్ట్రేలియా.. వచ్చే నెల నుంచి మళ్లీ ఆటను కొనసాగించాలని నిర్ణయించుకుంది. జూన్‌ 6న టీ20 డార్విన్‌ అండ్‌ డిస్ట్రిక్‌ క్రికెట్‌ టోర్నీతో దేశవాళీ సీజన్‌ మొదలు కానుంది. క్రికెటర్లు బంతిపై ఎలాంటి ఉమ్ము, చెమట ఉపయోగించకూడదని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా అంపైర్‌ సమక్షంలో మైనపు పూతను రాసి బంతికి మెరుపు తెప్పించే ప్రయోగాన్ని చేసే అవకాశాలున్నాయి. కూకాబుర్రా కంపెనీ ఈ మైనపు పూత అప్లికేటర్‌ని తయారు చేసింది. అంతేకాక క్రికెటర్లంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మైదానంలో బరిలో దిగనున్నారు.

ఇదీ చూడండి.. 'అఫ్రిది.. పాక్​ ప్రజలను మోసం చేసే ఓ జోకర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.