తనతో ఆడిన 11 మంది టీమ్ఇండియా ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును తయారు చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్. ఆ జాబితాను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పొందుపరిచాడు. ఆసీస్ జట్టుపై అత్యుత్తమ రికార్డులను నెలకొల్పిన వీవీఎస్ లక్ష్మణ్ పేరు అందులో లేకపోవటం గమనార్హం.
షేన్‌వార్న్ తన ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ప్రకటించిన భారత జట్టులో ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు ఉన్నారు. ఇందులో సిద్ధును తీసుకోవటంపై ఓ ప్రత్యేక కారణముందని తెలిపాడు. అతడు స్పిన్ బౌలింగ్‌లోనూ నిలకడగా రాణిస్తాడని.. ఈ విషయాన్ని అతడితో ఆడిన స్పిన్నర్లే చెప్పారన్నాడు. సౌరవ్ గంగూలీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. విరాట్ కోహ్లీ, ధోని పేర్లను ఇందులో చేర్చకపోవటానికి కారణం తాను వాళ్లతో ఆడకపోవటమేనని స్పష్టం చేశాడు.
![Australia former cricketer Shane Warne Picks Sourav Ganguly As Captain Of India's Greatest XI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6620732_2.jpg)
షేన్‌వార్న్.. టెస్టుల్లో టీమ్ఇండియాపై అనేక రికార్డులు నెలకొల్పాడు. భారత్‌తో ఆడిన 24 టెస్టుల్లో 45.79 సగటుతో 43 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 15 వికెట్లు సాధించాడు.
షేన్‌వార్న్ ప్రకటించిన ఉత్తమ జట్టిదే..
వీరేంద్ర సెహ్వాగ్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందుల్కర్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ(కెప్టెన్), కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, నయాన్ మోంగియా, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్.
ఇదీ చూడండి.. ప్రేయసి కోసం గోడ దూకిన హనుమ విహారి