టైటిల్ పోరుకు భారత్- ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. దిల్లీ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కంగారూల జట్టు. 2-2 తో సమంగా ఉన్న సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరుజట్లు ప్రయత్నిస్తున్నాయి.
బలమైన బ్యాటింగ్
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో ఖవాజా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫించ్, హాండ్స్‌కాంబ్, గత మ్యాచ్ సంచలనం టర్నర్లతో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది.
నిర్ణయాలు కీలకం...
నాలుగో వన్డేలో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించింది. క్లిష్టమైన పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్లగల సమర్ధుడు మహీ. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఎంతమేర తన అనుభవంతో నడిపిస్తాడో చూడాల్సిందే. తీసుకొనే ప్రతి నిర్ణయం కీలకం కానుంది.
స్పిన్‌కు అనుకూలం...
దిల్లీ పిచ్ మణికట్టు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కుల్దీప్, చాహల్ మంచి ప్రదర్శన ఇస్తే తక్కువ పరుగులకే ఆసిస్‌ను కట్టడి చేయొచ్చు. బుమ్రా, భువనేశ్వర్, షమి రూపంలో పేస్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది.
ప్రపంచకప్ ముందు భారత్‌కు ఇదే చివరి వన్డే. మెగాటోర్నీకి వెళ్లే జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న పంత్, విజయ్ శంకర్ ఈ మ్యాచ్‌లో నిరూపించుకోవాలి. ఆఖరి వన్డేలో జడేజాకు నిరాశ ఎదురైంది. దిల్లీ పిచ్ లెఫ్టార్మ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.