పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ పాటిన్సన్‌పై ఒక మ్యాచ్ వేటు వేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. గత వారం షెఫీల్డ్‌షీల్డ్-క్వీన్స్‌లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో... ప్రత్యర్థి జట్టు ఆటగాడిపై పాటిన్సన్ అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు బోర్డు విచారణలో తేలింది. ఫీల్డింగ్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు బోర్డు పేర్కొంది.
ఒక మ్యాచ్ సస్పెన్షన్...
పాటిన్సన్ క్రికెట్ నియమావళిని ఉల్లంఘించినట్లు భావించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు... అతడిపై ఒక మ్యాచ్ నిషేధం వేసింది. ఫలితంగా గురువారం బ్రిస్బేన్ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న తొలి టెస్టుకు అతడు తప్పుకోనున్నాడు. ఈ ఆటగాడు గత 18 నెలల్లో మూడుసార్లు నిబంధనలు అతిక్రమించినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
అవును తప్పు చేశాను...
సస్పెన్షన్ నేపథ్యంలో పాటిన్సన్ తన తప్పును అంగీకరించినట్లు సమాచారం. అతడు తప్పుగా ప్రవర్తించిన తర్వాత అంపైర్లకు, ప్రత్యర్థి జట్టు ఆటగాడికి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది.
పాటిన్సన్‌పై నిషేధంతో మరో ఆటగాడు మిచెల్ స్టార్క్‌కు జట్టులో అవకాశం కల్పించింది ఆసీస్ బోర్డు.
ఇదీ చూడండి:పృథ్వీ షా ఘనమైన పునరాగమనం.. అర్ధశతకంతో అదరహో