పాకిస్థాన్‌తో జరిగిన తొలిటెస్టులో ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్(104) శతకంతో ఆకట్టుకున్నా, జట్టును ఓటమి నుంచి దూరం చేయలేకపోయాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 4 వికెట్లతో రాణించగా.. స్టార్క్ 3, కమిన్స్ 2 వికెట్లు తీశారు.
మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసిన కంగారూ బ్యాట్స్‌మన్ లబుషేన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
బాబర్ సెంచరీ వృథా..
ఓవర్ నైట్ స్కోరు 64/3తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన పాకిస్థాన్, 335 పరుగులకు ఆలౌటైంది. బాబర్ అజమ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 173 బంతుల్లో 104 పరుగులు చేసి కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. వికెట్ కీపర్ రిజ్వాన్ 95 పరుగులు చేసి త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
ఆసీస్ విజయం ఆలస్యం..
94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాక్‌ను బాబర్-రిజ్వాన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు. అనంతరం బాబర్ ఔటైనప్పటికీ.. యాసిర్ షా(42) సాయంతో రిజ్వాన్ జట్టును ముందుకు నడిపించాడు. చివర్లో ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ విజృంభించి టెయిలెండర్లను పెవిలియన్‌కు పంపాడు.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ 580 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. కంగారూ బ్యాట్స్‌మెన్ లబుషేన్(185), వార్నర్(154) శతకాలతో విజృంభించి విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటి ఇన్నింగ్స్‌లో స్టార్క్ 4 వికెట్లతో ఆకట్టుకోగా.. కమిన్స్ 3 వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి: కోహ్లీని ఔట్ చేసిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి