స్టీవ్ స్మిత్ మరోసారి కెప్టెన్ అయితే తనకు ఏమాత్రం ఇబ్బంది లేదంటున్నాడు ఆస్ట్రేలియా టెస్టు సారథి టిమ్‌పైన్. మీడియాతో మాట్లాడిన అతడు స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే తన మద్దతు ఉంటుందని చెప్పాడు.
"ప్రస్తుతం నాకు అప్పగించిన బాధ్యతలతో సంతోషంగా ఉన్నా. స్టీవ్ స్మిత్ ఆస్టేలియా జట్టుకు మళ్లీ కెప్టెన్ అయితే అతడికి నా పూర్తి మద్దతు ఉంటుంది" - టిమ్‌పైన్, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్
గత ఏడాది బాల్ ట్యాంపరింగ్ వివాదంతో డేవిడ్ వార్నర్‌తో పాటు, స్టీవ్ స్మిత్‌ను ఏడాది పాటు నిషేధించింది ఐసీసీ. ఈ కారణంగా కంగారూ టెస్టు పగ్గాలు టిమ్‌పైన్‌కు అప్పగించింది ఆసీస్ క్రికెట్ బోర్డు. అంతకుముందు వరకు స్మిత్ సారథ్యం వహించాడు.
అయితే కెప్టెన్సీ విషయంలో టిమ్‌పైన్ విమర్శలు ఎదుర్కొన్నాడు. సొంత గడ్డపై జరిగిన పాకిస్థాన్, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో ఆసీస్ పరాజయం చెందడమే ఇందుకు కారణం.
ఇదీ చదవండి: బ్యాటింగ్, బౌలింగ్ వీడి.. నటన వైపు భారత క్రికెటర్లు!