అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టులో తొలిసారి 300 పైగా వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్. ఈ మ్యాచ్‌లో 335* పరుగులు(418 బంతుల్లో ; 39 ఫోర్లు, 1 సిక్సర్) బాది అజేయంగా నిలిచాడు. అయితే ఇతడు మంచి ఫామ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. లారా అత్యధిక వ్యక్తిగత పరుగుల (400) రికార్డుకు 65 పరుగుల దూరంలో ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చాడు.
-
Insanely good! 💪
— cricket.com.au (@cricketcomau) November 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
335* for David Warner! 🙌@bet365_aus | #AUSvPAK pic.twitter.com/qEaVup8XIw
">Insanely good! 💪
— cricket.com.au (@cricketcomau) November 30, 2019
335* for David Warner! 🙌@bet365_aus | #AUSvPAK pic.twitter.com/qEaVup8XIwInsanely good! 💪
— cricket.com.au (@cricketcomau) November 30, 2019
335* for David Warner! 🙌@bet365_aus | #AUSvPAK pic.twitter.com/qEaVup8XIw
ఫలితంగా వార్నర్.. లారా రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం కోల్పోయాడని అభిమానులు ఆసీస్ సారథిపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఆ సంఘటనపై క్లారిటీ ఇచ్చాడీ ఓపెనర్. వర్షం పడుతుందనే సమాచారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అనంతరం ఆ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఒక్క ఆటగాడికే ఉందని.. భారతీయ క్రికెటర్ పేరు చెప్పాడు.
ఇతడికే సాధ్యం..
విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 400* పరుగుల మార్కును అందుకునే సత్తా టీమిండియా ఓపెనర్ రోహిత్శర్మకే ఉందని అభిప్రాయపడ్డాడు వార్నర్. 2004లో ఇంగ్లాండ్‌పై ఈ రికార్డు సృష్టించాడు లారా. దాదాపు 15 ఏళ్లయినా ఎవరూ ఆ మైలురాయిని చేరుకోలేకపోయారు.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్.. వరుసగా రెండు శతకాలు, ఓ ద్విశతకం సాధించాడు. ప్రస్తతం టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో ఉన్నాడు హిట్‌మ్యాన్.
-
100 ✔
— BCCI (@BCCI) October 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
150 ✔
200 ✔@ImRo45 you beauty 😍 pic.twitter.com/FDMXsjlwcr
">100 ✔
— BCCI (@BCCI) October 20, 2019
150 ✔
200 ✔@ImRo45 you beauty 😍 pic.twitter.com/FDMXsjlwcr100 ✔
— BCCI (@BCCI) October 20, 2019
150 ✔
200 ✔@ImRo45 you beauty 😍 pic.twitter.com/FDMXsjlwcr