ETV Bharat / sports

గాయంతో మైదానాన్ని వీడిన ఉమేశ్ యాదవ్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా పేసర్ ఉమేశ్​ యాదవ్​కు గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

umesh
ఉమేశ్​
author img

By

Published : Dec 28, 2020, 10:23 AM IST

మెల్​బోర్న్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో దూకుడుగా ఆడుతోన్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియా పేసర్​ ఉమేశ్ యాదవ్​కు గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు.

మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో తన నాలుగో ఓవర్ బౌలింగ్​ వేస్తున్న సమయంలో ఉమేశ్​ మోకాలికి దెబ్బ తగిలింది. వెంటనే అతడిని డ్రెసింగ్​ రూమ్​కు తరలించారు. తాను వేసిన రెండో ఓవర్లో జో బర్న్స్ వికెట్ తీసి టీమ్ఇండియాకు శుభారంభాన్ని అందించాడు ఉమేశ్.

ఇప్పటికే గాయాల కారణంగా మహ్మద్​ షమీ, ఇషాంత్​ శర్మ సేవలను కోల్పోయింది టీమ్ఇండియా. కాగా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి 28 ఓవర్లకు 65/2 పరుగులతో కొనసాగుతోంది.

ఇదీ చూడండి : భారత్ 326 ఆలౌట్.. ఆధిక్యం 131

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.