టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్లు మరికొద్దిసేపట్లో మూడో వన్డేలో తలపడనున్నాయి. కాన్బెర్రా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ తుదిజట్టులో భారీమార్పులు జరిగాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ వచ్చాడు. సైని, షమి, చాహల్ స్థానాల్లో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎడమచేతి వాటం పేసర్ అయిన నటరాజన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు.
ఎన్నో ఆశలు, అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగు పెట్టి, వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ టీమ్‌ఇండియా.. నేడు మూడో వన్డే సమరానికి సిద్ధమైంది. సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయినప్పటికీ.. ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలన్నా, టీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలన్నా ఈ మ్యాచ్‌లో భారత్‌కు విజయం తప్పనిసరి. తొలి మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఆటతీరులో ఏమాత్రం మార్పు చూపించలేకపోయినా భారత్.. ఈ మ్యాచ్‌లోనూ మారకుంటే పర్యటనలో మున్ముందు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి కోహ్లీసేన అత్యవసరంగా మేల్కోవాల్సిందే.
జట్ల వివరాలు:
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, నటరాజన్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), లబుషేన్, స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్, స్టాయినిస్, హెన్రిక్స్, అలెక్స్ కేరీ, కామెరన్ గ్రీన్, ఆస్టన్ అగర్, హేజిల్‌వుడ్, సీన్ అబాట్, జంపా