టీమ్ఇండియాకు మరో షాక్! సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మణికట్టు బెణకడం వల్ల ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రకటించింది.
ఇప్పటికే కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ జట్టుకు దూరమైన ప్రతికూలతల్లో.. కేఎల్ రాహుల్ కూడా దూరమవ్వడం టీమ్ఇండియాను కలవరపెడుతోంది. అయితే ప్రాక్టీస్‌లో రాహుల్‌కు శనివారమే గాయమైందని, కోలుకోవడానికి మరో మూడు వారాలు పడుతుందని బీసీసీఐ తెలిపింది. అతడు స్వదేశానికి బయలుదేరి, ఎన్‌సీఏలో చేరనున్నాడని వెల్లడించింది.
"మెల్‌బోర్న్ మైదానంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కేఎల్ రాహుల్ ఎడమచేతి మణికట్టు బెణికింది. గాయం కారణంగా రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలోని చివరి రెండు టెస్టులకు దూరమవుతున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి అతడికి మూడు వారాలు పడుతుంది. అతడిప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లనున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చేరుతాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
-
UPDATE: KL Rahul ruled out of Border-Gavaskar Trophy.
— BCCI (@BCCI) January 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
More details 👉 https://t.co/G5KLPDLnrv pic.twitter.com/S5z5G3QC2L
">UPDATE: KL Rahul ruled out of Border-Gavaskar Trophy.
— BCCI (@BCCI) January 5, 2021
More details 👉 https://t.co/G5KLPDLnrv pic.twitter.com/S5z5G3QC2LUPDATE: KL Rahul ruled out of Border-Gavaskar Trophy.
— BCCI (@BCCI) January 5, 2021
More details 👉 https://t.co/G5KLPDLnrv pic.twitter.com/S5z5G3QC2L