ETV Bharat / sports

టీమ్​ఇండియాలో కనిపించని జోష్.. రెండో వన్డేలోనైనా?

author img

By

Published : Nov 28, 2020, 8:34 AM IST

Updated : Nov 28, 2020, 10:11 AM IST

ఆసీస్​తో జరిగిన తొలి మ్యాచ్​లో అన్ని విభాగాల్లో టీమ్​ఇండియా విఫలమైంది. ఈ విషయాన్ని కోహ్లీ కూడా ఒప్పుకున్నాడు. మరి రెండో వన్డేలోనైనా భారత జట్టు ప్రదర్శన మారుతుందా? లేదా? అని అభిమానులు అనుకుంటున్నారు.

AUS VS IND FIRST ODI ANALYSIS STORY
ఏదీ ఆ తీవ్రత.. టీమ్​ఇండియాలో కనిపించని జోష్!

అగ్రజట్టు ఆస్ట్రేలియాతో దాని సొంతగడ్డపై సుధీర్ఘ సిరీస్​ ఆడేటప్పుడు తొలి మ్యాచ్​లో విజయం ఎంతో అవసరం. కానీ అలాంటి కీలక మ్యాచ్​లో భారత్​ పూర్తిగా విఫలమైంది. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు పకడ్బంధీగా బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్​లో ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు నిరాశపరిచారు. అత్యుత్తమ జట్టుతో సిరీస్​ ఆడుతున్నప్పుడు తొలి మ్యాచ్​లో చూపించాల్సిన తీవ్రత టీమ్​ఇండియా ఆటగాళ్లలో కనిపించలేదు. తొలి అర్ధంలో బౌలింగ్, ఫీల్డింగ్ పూర్తిగా తేలిపోయింది. ఒక్క ఇన్నింగ్స్​ అయినా అవకముందే ఈ మ్యాచ్​లో ఫలితం తేలిపోయింది! ఏ దశలోనూ అసలు విజయం సాధించే జట్టులా భారత్ ఆడలేదు. టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.

team india
టీమ్​ఇండియా

'వన్డేల్లో 50 ఓవర్ల పాటు తీవ్రత కొనసాగించాల్సి ఉంటుంది కానీ చాలాకాలం తర్వాత వన్డే ఆడటం వల్ల వెనుకబడ్డామేమో అనిపిస్తోంది. అయితే మేం చాలా కాలంగా క్రికెట్​ ఆడుతున్నాం కాబట్టి ఎలా స్పందించాలో తెలుసు. కానీ ఈ మ్యాచ్​లో ఫీల్డింగ్​లో ఆటగాళ్ల శరీర కదలికలు మరీ పేలవంగా ఉన్నాయి. 25 ఓవర్ల తర్వాత చురుగ్గా కనిపించలేదు. అది చాలా నిరాశ కలిగించింది. అత్యంత నాణ్యమైన జట్టుతో పోటీపడ్డప్పుడు అవకాశాలు వదులుకుంటే ఫలితం ఇలానే ఉంటుంది. హార్దిక్ బౌలింగ్ వేసేందుకు ఇంకా సిద్ధం కాకపోవడం జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది' అని కోహ్లీ చెప్పాడు. ఈ మ్యాచ్​ ప్రభావం నుంచి బయటపడి రెండో వన్డేలోనైనా కసితో ఆడుతుందేమో చూడాలి.

సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్​లో చిత్తుగా ఓడింది భారత్. 66 పరుగుల తేడాతో గెలిచి ఆస్ట్రేలియా.. 1-0తో సిరీస్​లో ఆధిక్యం సంపాదించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Nov 28, 2020, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.