ETV Bharat / sports

టెస్టు జట్టులో వార్నర్​.. త్వరలో మైదానంలోకి!

author img

By

Published : Dec 30, 2020, 5:04 PM IST

చివరి రెండు టెస్టుల కోసం విడుదల చేసిన జట్టులో వార్నర్​కు స్థానం కల్పించింది ఆస్ట్రేలియా. దీంతో అతడు త్వరలో మైదానంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

AUS vs IND: David Warner back in Australia Test squad
సిడ్నీ టెస్టులో వార్నర్​ పునరాగమనం​!

ఆసీస్​ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. ఇందులో భాగంగానే టీమ్​ఇండియాతో చివరి రెండు టెస్టుల కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు కొత్త టీమ్​ జాబితాను విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. జో బర్న్స్​ను తప్పించిన ఆసీస్​ సెలక్టర్లు వార్నర్​కు స్థానం కల్పించారు. భారత్​తో రెండో వన్డేలో గాయపడిన ఇతడు.. చివరి వన్డేతో పాటు తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ​

వార్నర్​ వేగంగా కోలుకుంటున్నాడని ఆస్ట్రేలియా సెలెక్టర్​ ట్రెవర్ హోన్స్ ప్రకటనలో తెలియజేశాడు. మూడో టెస్టు జరగడానికి మరో ఏడు రోజులు ఉన్నందున అతడు​ కోలుకుని.. జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపాడు.

AUS vs IND: David Warner back in Australia Test squad
టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో గాయపడిన డేవిడ్​ వార్నర్​

విల్​ పకోవ్​స్కీ, మార్కస్​ హారిస్​లు ఆస్ట్రేలియా మరో ఓపెనింగ్​ జోడీగా ఉన్నారు. టీమ్​ఇండియాతో జరిగిన వార్మప్​ మ్యాచ్​లో పకోవ్​స్కీ కంకషన్ గురయ్యాడు. దీనివల్లే​ రెండు టెస్టులకు దూరమయ్యాడు. అలానే మిగిలిన రెండు టెస్టుల కోసం సీన్​ అబాట్​ కూడా జట్టులోకి పునరాగమనం చేయనున్నాడని తెలుస్తోంది.

డేవిడ్​ వార్నర్​

ఆస్ట్రేలియా టెస్టు జట్టు​: టిమ్ పైన్​ (కెప్టెన్​), పాట్ కమిన్స్​ (వైస్​-కెప్టెన్​), సీన్​ అబాట్​, కామెరూన్​ గ్రీన్​, జోష్​ హేజిల్​వుడ్​, మార్కస్​ హారిస్​, ట్రావిస్​ హెడ్​, హెన్రిక్స్​, లబుషేన్​, లైయన్, మిచెల్​ నీసర్​, జేమ్స్​ పాటిన్సన్​, విల్​ పకోవ్​స్కీ, స్టీవ్​ స్మిత్​, మిచెల్​ స్టార్క్, మిచెల్​ స్వీప్​సన్​, మాథ్యూ వేడ్​, డేవిడ్ వార్నర్​

ఇదీ చూడండి: సిడ్నీ టెస్టులో సంబరాలు బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.