ETV Bharat / sports

టీ20 సిరీస్: ఆసీస్​పై భారత్ ఆధిపత్యం వహిస్తుందా? - కోహ్లీ వార్తలుట

బౌలర్లకు సహకరిస్తున్న కాన్​బెర్రా పిచ్​పై జరగబోయే తొలి టీ20 కోసం భారత్-ఆస్ట్రేలియా సిద్ధమవుతున్నాయి. చివరి వన్డేలో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న కోహ్లీసేన.. ఇందులోనూ సత్తా చాటాలని భావిస్తోంది. వన్డే సిరీస్ గెలిచిన ఆసీస్ అదే జోరును టీ20ల్లోనూ కొనసాగించాలని చూస్తోంది.

AUS vs IND 1st T20I preview: Match at Manuka Oval, Canberra 01:40 PM
టీ20 సిరీస్: గెలిచిన ఊపుతో కోహ్లీసేన.. ప్రతీకారంతో ఆసీస్
author img

By

Published : Dec 4, 2020, 5:32 AM IST

వన్డే సిరీస్​ కోల్పోయినా సరే చివరి మ్యాచ్​లో గెలిచి పరువు నిలుపుకొంది టీమ్​ఇండియా. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు టీ20 సిరీస్​కు సిద్ధమవుతోంది. కాన్​బెర్రా వేదికగా శుక్రవారం తొలి మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:40 గంటలకు ఈ పోరు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.

AUS vs IND 1st T20I preview
టీమ్​ఇండియా బృందం

కుర్రాళ్లతో భారత జట్టు సమతూకం!

వన్డే సిరీస్​లో భారత్​ ఓటమికి కారణాలు ఏమైనప్పటికీ, టీ20ల్లో మాత్రం కోహ్లీసేనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్​లో జట్టులోని కుర్రాళ్లందరూ అద్భుతంగా రాణించారు. ఆ ఫామ్​ను ఈ సిరీస్​లో కొనసాగిస్తే మ్యాచ్​లు గెలవడం పెద్ద కష్టమేమి కాదు.

వన్డేల్లో మిడిలార్డర్​లో వచ్చిన కేఎల్ రాహుల్.. ఈ సిరీస్​లో ధావన్​తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశముంది. నాలుగులో శ్రేయస్​ అయ్యర్ లయను అందుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. హార్దిక్ పాండ్యా, జడేజా.. బ్యాటుకు పనిచెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

hardik - jadeja
హార్దిక్ పాండ్య- జడేజా

బౌలింగ్​లో సుందర్, దీపక్ చాహర్, యార్కర్ స్పెషలిస్టు నటరాజన్​కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి బుమ్రాతో కొత్త బంతిని పంచుకునేది షమీనా, నటరాజన్​ అనేది చూడాలి.

మూడో వన్డేలో కొద్దిలో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. జట్టులోని కీలక ఆటగాళ్లకు గాయాలు కావడం ఆసీస్​ మేనేజ్​మెంట్​ను కలవరపరుస్తున్న అంశం. మరి తొలి టీ20లో ఫించ్ సేన ఏం చేస్తుందో చూడాలి?

AUS vs IND 1st T20I preview
ఆస్ట్రేలియా జట్టు

జట్లు(అంచనా)

టీమ్​ఇండియా: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా

ఆస్ట్రేలియా: ఫించ్(కెప్టెన్), లబుషేన్, స్మిత్, హెన్రిక్స్, కామెరూన్ గ్రీన్, మ్యాక్స్​వెల్, క్యారీ, అగర్, హేజిల్​వుడ్, స్టార్క్, జంపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.