ETV Bharat / sports

'ప్రస్తుతం క్రికెట్​ను ఎంతగానో ఆస్వాదిస్తున్నా'

ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో స్మిత్​పై స్లెడ్జింగ్​ చేయకపోవచ్చని తెలిపాడు టీమ్​ఇండియా బౌలర్​ ఇషాంత్​ శర్మ. ప్రస్తుతం తన లక్ష్యం కేవలం జట్టును గెలిపించే దిశగా కృషి చేయడేమనని అన్నాడు. తానిప్పుడు ఆటను ఎంతగానో ఆస్వాదించే దశలో ఉన్నట్లు వెల్లడించాడు.

author img

By

Published : Jun 1, 2020, 6:23 AM IST

ishant
ఇషాంత్​

మైదానంలో బరిలో దిగిన క్రికెటర్లు స్లెడ్జింగ్​కు పాల్పడే సందర్భాలు సాధారణంగానే జరుగుతుంటాయి. ముఖ్యంగా 2017లో బెంగళూరు వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​లో టీమ్​ఇండియా బౌలర్​ ఇషాంత్​ శర్మ.. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్​ స్మిత్​పై చేసిన స్లెడ్జింగ్​ అభిమానుల మదిలో గుర్తుండిపోతుంది. ఎందుకంటే ముఖ కవళికల ద్వారా ఇషాంత్​ చేసిన స్లెడ్జింగ్​ ఎంతో హాస్యస్పదంగా ఉంటుంది. దీనిపై అనేకమంది మీమ్స్ కూడా తయారు చేశారు.

అయితే ఈ ఏడాది జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్​లో స్మిత్​పై స్లెడ్జింగ్​ చేయడం సాధ్యం కాకపోవచ్చని తెలిపాడు ఇషాంత్​. ప్రస్తుతం తాను ఆటను ఎంతగానో ఆస్వాదించే దశలో ఉన్నట్లు పేర్కొన్నాడు. జట్టును గెలిపించడమే ముఖ్య లక్ష్యమని అన్నాడు. బీసీసీఐ టీవీ నిర్వహించిన ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌ కార్యక్రమంలో ఇషాంత్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు.

"ప్రస్తుతం నేను క్రికెట్​ను ఎంతగానో ఆస్వాదించే దశలో ఉన్నా. మ్యాచులో ఎక్కువ వికెట్లు తీసి, జట్టును గెలిపించే దిశగా కృషి చేయడం నా లక్ష్యం. "

-ఇషాంత్​ శర్మ, టీమ్​ఇండియా బౌలర్​.

ఈ కార్యక్రమంలో.. ఇషాంత్ 2017లో జరిగిన టెస్టు మ్యాచ్​లో ఎందుకు స్మిత్​పై స్లెడ్జింగ్​ చేశాడో కూడా వివరించాడు. స్మిత్‌ను క్రీజ్​లో కుదురుకోనీయకుండా అతడి ఏకాగ్రతను దెబ్బతీయడానికి అలా చేసినట్లు తెలిపాడు.

ఇదీ చూడండి : పాంటింగ్​ కన్నా స్మిత్​నే అలా అంటాను: ఇషాంత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.