ETV Bharat / sports

బీసీసీఐ అంగీకారం కోసం పాక్ ఎదురుచూపులు

author img

By

Published : Sep 29, 2019, 10:06 PM IST

Updated : Oct 2, 2019, 12:47 PM IST

వచ్చే ఏడాది ఆసియాకప్​లో టీమిండియా పాల్గొనే విషయంలో బీసీసీఐ అంగీకారం కోసం ఎదురుచూస్తోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. వచ్చే సెప్టెంబరులో ఈ టోర్నీ జరగనుంది.

ఆసియా కప్​ 2020

వచ్చే ఏడాది పాకిస్థాన్​లో ఆసియాకప్ జరగనుంది. ఆసియా కప్​ పాక్​లో జరగుతుండటం వల్ల భారత్​ ఆడుతుందా లేదా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ విషయంపై పాక్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీంఖాన్ స్పందించారు. టీమిండియా పాల్గొనే విషయంపై బీసీసీఐకి వచ్చే జూన్​ వరకు గడువు ఇచ్చినట్టు తెలిపారు.

"టీమిండియా.. ఆసియాకప్​ కోసం పాకిస్థాన్​కు వచ్చేందుకు అంగీకరిస్తుందో లేదో చూడాలి. వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు సమయం ఉంది. జూన్​ వరకు వేచి చూస్తాం. ఎందుకంటే ఈ టోర్నీ నిర్వహణలో భారత్​ ప్రమేయం చాలా ఉంది. ఇక్కడ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ నిర్ణయించాయి. ఇందులో భారత్​ పాల్గొంటుందని మేం ఆశిస్తున్నాం." -వసీం ఖాన్, పీసీబీ సీఈఓ

అదే విధంగా భారత్​తో దైపాక్షిక సిరీస్​ జరిపేందుకు ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయని అంగీకరించారు ఖాన్.

india-pakisthan cricketers
భారత్-పాకిస్థాన్ క్రికెటర్లు

"క్రికెట్ బోర్డు విషయంలో భారత్​తో సత్సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ టీమిండియా పాక్​లో పర్యటించి, ద్వైపాక్షిక సిరీస్​ ఆడాలంటే అక్కడి ప్రభుత్వం అనుమతి, తదితర అంశాలు ఉంటాయి. ఒకవేళ మాతో వారు ఆడాలనుకుంటే నిబద్ధతతో వ్యవహరించాలి. తటస్థ వేదికలో ఆడేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం". -వసీం ఖాన్, పీసీబీ సీఈఓ

చివరిసారి 2006లో పాకిస్థాన్​లో పర్యటించింది భారత జట్టు. ఇందులో భాగంగా ఆడిన మూడు మ్యాచ్​లు టెస్టు సిరీస్​ను 1-0 తేడాతో పాక్​ గెలుచుకోగా, 5 వన్డేల సిరీస్​ను 4-1 తేడాతో భారత్​ సొంతం చేసుకుంది.

ఇది చదవండి: క్రికెట్ తర్వాత ధోనీ చూపు అటువైపేనా..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AP via AGENCY POOL (REUTERS) - AP CLIENTS ONLY
Paris - 29 September 2019
1. Various of funeral procession carrying coffin of former French President Jacques Chirac, arriving at Invalides monument
2. Various of people queuing to pay their respects
3. Various of media
4. French flag flying above Invalides monument
STORYLINE:
Former French President Jacques Chirac's coffin on Sunday arrived at Paris' Invalides monument for mourners to pay their respects.
The French presidency announced that Chirac would lie in state during a public ceremony at the monument, where France honours its heroes.
A memorial service and private funeral are planned for Monday.
Chirac, the last French head of state to complete two terms in office, died Thursday at age 86.
Flags were lowered Friday on buildings and monuments throughout France in his honour.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.