బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. భారత క్రికెట్ అభిమానులకు నేడు అదిరిపోయే వార్త చెప్పాడు. దుబాయ్ వేదికగా జరిగే వచ్చే ఆసియాకప్లో టీమిండియా, పాకిస్థాన్లు పాల్గొంటాని చెప్పాడు. వచ్చే నెల 3న దుబాయ్లో జరగాల్సిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశానికి వెళ్తూ, ఈ విషయాన్ని వెల్లడించాడు దాదా.

పాకిస్థాన్ వేదికగా ఈ సెప్టెంబరులో ఆసియాకప్ జరగాల్సి ఉంది. భద్రతా కారణాల వల్ల కోహ్లీసేన.. ఆ దేశానికి వెళ్లేందుకు నిరాకరించింది. అందువల్ల తటస్థ వేదికలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయిం తీసుకుంది.
2012లో ఇరుదేశాలు చివరగా ఓ మ్యాచ్ ఆడాయి. ఆ తర్వాత నుంచి ఒక్క పరిమిత ఓవర్ల సిరీస్ అయినా ఈ రెండు జట్ల మధ్య జరగలేదు.
