ETV Bharat / sports

'ఆసియాకప్ దుబాయ్​లోనా​.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు'

ఆసియాకప్​ దుబాయ్​లో జరిగే విషయమై తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నాడు పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఎహెసన్ మణి.

asaincup
'ఆసియాకప్ దుబాయ్​లోనా​.. మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదు
author img

By

Published : Feb 29, 2020, 6:29 PM IST

Updated : Mar 2, 2020, 11:40 PM IST

ఈ ఏడాది సెప్టెంబరులో​ దుబాయ్​ వేదికగా ఆసియాకప్ జరుగుతుందని, టీమిండియా, పాకిస్థాన్​లు ఇందులో పాల్గొంటాయన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. శుక్రవారం ఈ విషయంపై స్పష్టతనిచ్చాడు. ఇప్పుడిదే అంశంపై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు ఎహెసన్​ మణి మాట్లాడాడు. ఈ టోర్నీ గురించి తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. ఆసియా దేశాల అసోసియేటివ్​ సభ్యులతో జరిగే భేటీలో అంతిమ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు.

"ఆసియాకప్​ నిర్వహణపై అంతిమ నిర్ణయం, అసోసియేటివ్​ దేశాలతో చర్చించిన తర్వాతే తీసుకుంటాం"

-ఎహెసన్ మణి, పీసీబీ అధ్యక్షుడు

పాకిస్థాన్ వేదికగా ఈ సెప్టెంబరులో ఆసియాకప్​ జరగాల్సి ఉంది. భద్రతా కారణాల వల్ల కోహ్లీసేన.. ఆ దేశానికి వెళ్లేందుకు నిరాకరించింది. అందువల్ల తటస్థ వేదికలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ భావించింది. వచ్చే నెల 3న దుబాయ్​లో జరగాల్సిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఇదే విషయంపైన చర్చ జరుగుతుంది.

2012లో భారత్-పాక్ మధ్య చివరగా మ్యాచ్​ జరిగింది. ఆ తర్వాత నుంచి ఒక్క పరిమిత ఓవర్ల సిరీస్​ అయినా ఈ రెండు జట్ల మధ్య వీలుపడలేదు.

ఇదీ చూడండి : భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. స్పష్టం చేసిన ​గంగూలీ

Last Updated : Mar 2, 2020, 11:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.