ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020కి మరో నెల రోజులే ఉంది. సమయం దగ్గర పడటం వల్ల ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో దుబాయ్‌కు పంపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే యూఏఈలో అడుగుపెట్టాయి. దిల్లీ క్యాపిటల్స్ సహా మరికొన్ని జట్లు ఈ రోజు పయనమవుతున్నాయి.
కరోనా వైరస్ ముప్పు పొంచి వుండటం వల్ల ఫ్రాంఛైజీలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఆటగాళ్లకు పీపీఈ కిట్లు అందించాయి. శానిటైజర్లు, సబ్బులతో కూడిన ప్రత్యేక కిట్‌ను ఇచ్చాయి. రెండు కన్నా ఎక్కువసార్లే ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేయించాయి. చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి నగరాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి ఆటగాళ్లను మొదట అక్కడకు రప్పించాయి. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు పంపించాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్లకు కుటుంబ సభ్యులు జాగ్రత్తలు చెప్పారు.
దుబాయ్‌కు పయనమైన క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అతడి ముద్దుల కుమార్తెలు జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఎవరినీ, దేనినీ ముట్టుకోవద్దని, ముద్దు పెట్టొద్దని ముద్దుముద్దుగా సూచించారు. అందుకు అశ్విన్ 'సరేనమ్మా..' అంటూ బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అశ్విన్ సతీమణి ప్రీతి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
-
Our girls giving @ashwinravi99 tips to stay safe during his flight ❤️ 😂 It's going to be super hard without him :( I mean who is going to sit for two sets of online classes now? 😭 #thatthatmanthatthatproblem pic.twitter.com/eRUojZqTHp
— Prithi Ashwin (@prithinarayanan) August 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our girls giving @ashwinravi99 tips to stay safe during his flight ❤️ 😂 It's going to be super hard without him :( I mean who is going to sit for two sets of online classes now? 😭 #thatthatmanthatthatproblem pic.twitter.com/eRUojZqTHp
— Prithi Ashwin (@prithinarayanan) August 20, 2020Our girls giving @ashwinravi99 tips to stay safe during his flight ❤️ 😂 It's going to be super hard without him :( I mean who is going to sit for two sets of online classes now? 😭 #thatthatmanthatthatproblem pic.twitter.com/eRUojZqTHp
— Prithi Ashwin (@prithinarayanan) August 20, 2020
గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సారథ్యం వహించిన అశ్విన్.. ఈసారి దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.