మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 319 బంతుల్లో 211 పరుగులు (24 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 497 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
-
Steve Smith was simply sensational with his third #Ashes double-century to guide our Aussies to 8-497 declared.
— Cricket Australia (@CricketAus) September 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
England are 1-23 in replay at stumps on day two. pic.twitter.com/qJi8NvUisd
">Steve Smith was simply sensational with his third #Ashes double-century to guide our Aussies to 8-497 declared.
— Cricket Australia (@CricketAus) September 5, 2019
England are 1-23 in replay at stumps on day two. pic.twitter.com/qJi8NvUisdSteve Smith was simply sensational with his third #Ashes double-century to guide our Aussies to 8-497 declared.
— Cricket Australia (@CricketAus) September 5, 2019
England are 1-23 in replay at stumps on day two. pic.twitter.com/qJi8NvUisd
స్మిత్ విలువైన భాగస్వామ్యం...
ఓవర్‌నైట్ స్కోరు 170 పరుగుల (3 వికెట్ల నష్టానికి) వద్ద గురువారం ఆట కొనసాగించిన ఆసీస్... వేగంగా ఆడింది. కంగారూ జట్టు స్టార్ క్రికెటర్ స్మిత్...పైన్, స్టార్క్‌తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను ఆడుకున్నాడు. కెప్టెన్ టిమ్ పైన్ 127 బంతుల్లో 58 పరుగులు (8 ఫోర్లు), లోయర్ ఆర్డర్‌లో మిచెల్ స్టార్క్ 58 బంతుల్లో 54 నాటౌట్ (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు.
-
Finally! A fantastic innings from Steve Smith comes to an end.
— England Cricket (@englandcricket) September 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard/Clips: https://t.co/rDgrysSBQA#Ashes pic.twitter.com/F1dGlEAim3
">Finally! A fantastic innings from Steve Smith comes to an end.
— England Cricket (@englandcricket) September 5, 2019
Scorecard/Clips: https://t.co/rDgrysSBQA#Ashes pic.twitter.com/F1dGlEAim3Finally! A fantastic innings from Steve Smith comes to an end.
— England Cricket (@englandcricket) September 5, 2019
Scorecard/Clips: https://t.co/rDgrysSBQA#Ashes pic.twitter.com/F1dGlEAim3
అంతకుముందు హెడ్ (19), వేడ్ (16) త్వరగానే వెనుదిరిగినా.... పైన్‌తో ఆరో వికెట్‌కు 145 పరుగులు జోడించాడు స్మిత్. 8వ వికెట్‌కు స్టార్క్‌తో కలిసి 51 పరుగులు జోడించి జట్టును గాడిన పెట్టాడు. ఈ క్రమంలో 160 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 118 పరుగుల వద్ద స్పిన్నర్ లీచ్ బౌలింగ్‌లో... స్లిప్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చినా అది నోబాల్ కావడం వల్ల నాటౌట్‌గా బతికిపోయాడు.
తన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ (310 బంతుల్లో) సాధించాడు. అనంతరం పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.
వన్డేలా ఆడేశారు...
స్మిత్ ఔటయ్యాక స్టార్క్, లైయన్ వేగంగా ఆడారు. వన్డే తరహాలో ఈ జోడీ 49 బంతుల్లో 59 పరుగులు చేసింది. ఆసీస్ ఆఖరి 10 ఓవర్లలో 80 పరుగులకు పైగా చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్‌కు 3, లీచ్, ఓవర్టన్‌కు చెరో 2 వికెట్లు దక్కాయి.
-
FIFTY! Starc brings up his 10th half-century off 49 balls in an entertaining return to the Test side #Ashes pic.twitter.com/I0K84ywiou
— cricket.com.au (@cricketcomau) September 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">FIFTY! Starc brings up his 10th half-century off 49 balls in an entertaining return to the Test side #Ashes pic.twitter.com/I0K84ywiou
— cricket.com.au (@cricketcomau) September 5, 2019FIFTY! Starc brings up his 10th half-century off 49 balls in an entertaining return to the Test side #Ashes pic.twitter.com/I0K84ywiou
— cricket.com.au (@cricketcomau) September 5, 2019
వికెట్ డౌన్...
అనంతరం... తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్... రెండో రోజు ఆట ముగిసేసరికి ఓపెనర్ డెన్లీ (4) వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్లకు 23 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు ఇంకా 474 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం రోరి బర్న్స్ (15), కెప్టెన్ జో రూట్ (3) క్రీజులో ఉన్నారు.
ఇదీ చదవండి..కోహ్లీకి మరో ఝలక్ ఇచ్చిన స్మిత్