ETV Bharat / sports

ఆర్చర్ చేతి వేలిలో గాజుముక్క తొలగించిన వైద్యులు

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ కుడిచేతికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) స్పష్టం చేసింది. సర్జరీలో భాగంగా అతని చేతి వేలిలో ఓ చిన్న గాజు ముక్కను తొలగించినట్లు వెల్లడించింది.

Archer undergoes successful surgery, to begin two weeks' rehabilitation
ఆర్చర్​ శస్త్రచికిత్స విజయవంతం.. ఈసీబీ స్పష్టం
author img

By

Published : Mar 31, 2021, 4:31 PM IST

Updated : Mar 31, 2021, 4:44 PM IST

ఇంగ్లాండ్ స్టార్​ క్రికెటర్​ జోఫ్రా ఆర్చర్​ కుడి చేతికి శస్త్రచికిత్స విజయవంతంగా అయినట్లు ఇంగ్లాండ్ అండ్​ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. అతడు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు బోర్డు పేర్కొంది.

"ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్​కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. అతడి కుడి చేతి మధ్య వేలి నుంచి ఓ చిన్న గాజు ముక్కను తొలగించారు. అతడు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. అతడు తిరిగి శిక్షణకు వచ్చే ముందు వైద్య బృందం సమీక్షిస్తుంది." అని ఈసీబీ తెలిపింది.

అసలేమైంది..

ఈ ఏడాది జనవరిలో తన ఇంట్లోని అక్వేరియాన్ని శుభ్రం చేస్తుండగా.. పొరపాటున అది కింద పడి ఆర్చర్​ వేలికి గాయం అయింది. దానికి అప్పట్లోనే చికిత్స చేయించుకున్నాడు ఈ స్టార్​ క్రికెటర్​​. ఇటీవల ఇండియాతో సిరీస్ సందర్భంగా ఆర్చర్​ మోచేతికి గాయమైంది.. దీంతో సిరీస్​కు దూరమైన అతడు వేలు గాయానికి కూడా వైద్యున్ని సంప్రదించాడు. దానికి సర్జరీ నిర్వహించి.. ఓ చిన్న గాజు ముక్కను వెలికి తీశారు వైద్యులు.

ఇదీ చదవండి: ఆర్చర్​ మోచేతికి సర్జరీ.. ఈసీబీ స్పష్టం

Last Updated : Mar 31, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.