టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు.. అసోం, బిహార్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. యాక్షన్ ఎయిర్ ఇండియా, రాపిడ్ రెస్పాన్స్, గూంజ్ అనే మూడు స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేస్తామని, తద్వారా వారికి ఆదుకుంటామని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"కరోనాతో దేశం ఓ వైపు పోరాటం చేస్తుండగా, మరోవైపు అసోం, బిహార్లలో వరదల రావడం బాధకరం. అందులో చిక్కుకున్న వారికి త్వరగా ఉపశమనం కలగాలని ప్రార్థిస్తున్నాం. ఈ వరదల నుంచి ఉపశమనం కోసం కృషి చేస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలతో (యాక్షన్ ఎయిడ్ ఇండియా, రాపిడ్ రెస్పాన్స్, గూంజ్) కలిసి వారికి అవసరమైన సహాయాన్ని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం"
-అనుష్క శర్మ, బాలీవుడ్ నటి, నిర్మాత
అసోం, బిహార్ రాష్ట్రాలకు తోచినంత సాయం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు విరుష్క జోడీ. ఇప్పటివరకు అసోం వరదల్లో 107 మరణించగా.. కొండచరియలు విరిగిపడి 24 మంది చనిపోయారు. బిహార్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 11 మంది తనువు చాలించగా, దాదాపు 40 లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని బాధపడుతున్నారు.