ETV Bharat / sports

బతికే ఉన్నానని అప్పుడు అనిపించింది: రసెల్‌ - యాండ్రు రెసల్​

ఐపీఎల్​ 13వ సీజన్​లో బయోబబుల్​లో ఉండటం వల్లే తాను మంచి ప్రదర్శన చేయలేకపోయానని తెలిపాడు కోల్​కతా నైట్​ రైడర్స్​ ఆటగాడు రసెల్​. బాగా ఆడటానికి చాలా ప్రయత్నించినట్లు చెప్పాడు.

Andre Russell
రసెల్‌
author img

By

Published : Dec 13, 2020, 6:49 AM IST

Updated : Dec 13, 2020, 7:24 AM IST

వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్ అంటే అందరికీ గుర్తొచ్చేది బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించడం. కానీ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో అతడు ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 సగటుతో 117 పరుగులే చేశాడు. అయితే ఐపీఎల్‌లో సత్తాచాటడానికి ఎంతో ప్రయత్నించానని, కానీ ఏదీ కలిసిరాలేదని రసెల్ అన్నాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ (సీపీఎల్‌)‌ అనంతరం వెంటనే యూఏఈకి చేరుకోవడం వల్ల బయోబబుల్‌ తనను మానసికంగా దెబ్బతీసిందని తెలిపాడు.

"ఐపీఎల్‌లో పరుగులు సాధించాలనుకున్నా. దాని కోసం టెక్నిక్‌, స్టాన్స్‌లో మార్పులతో పాటు సమయాన్ని బట్టి భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించా. కానీ ఏదీ కలిసిరాలేదు. నాపై ఒత్తిడి ఉందనేది నిజం. నేను ప్రతిభావంతుడినే. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇలా ఎందుకు జరిగిందో తెలియట్లేదు. అన్నీ చకచకా జరిగిపోవాలని కోరుకున్నాను. సీపీఎల్‌ నుంచి నేరుగా అబుదాబికి వచ్చాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రాక్టీస్‌ చేయడం, ఆ తర్వాత హోటల్లోని రూమ్‌కు వెళ్లడం, పడుకోవడం, లేచి తయారై ప్రాక్టీస్‌ చేయడం... ఆ ప్రదేశాల్లో తప్ప బయటికి వెళ్లే అవకాశం లేదు. అయితే బయోబబుల్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత దుబాయ్‌లో సమయాన్ని ఆస్వాదించాను. ఇంకా బతికే ఉన్నానని అప్పుడు అనిపించింది. ఇలాంటి భావన జైలులో నుంచి బయటికి వచ్చినప్పుడు కలుగుతుంటుంది. కానీ లాక్‌డౌన్‌ వల్ల ఆ అనుభూతి కలిగింది" అని రసెల్ తెలిపాడు.

రసెల్​ కోల్​కతా నైట్​ రైడర్స్​కు ప్రాతినిథ్యం వహించాడు. పదమూడో సీజన్‌లో కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. అయిదో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్‌-4కు దూసుకెళ్లిన హైదరాబాద్, బెంగళూరు జట్ల మాదిరిగానే మోర్గాన్‌సేన 14 పాయింట్లు సాధించినప్పటికీ నెట్‌రన్‌రేటులో వెనుకబడటం వల్ల లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. జట్టు ప్రయోజనాల కోసం సీజన్‌ మధ్యలో దినేశ్‌ కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతలను మోర్గాన్‌కు ఇచ్చారు.

ఇదీ చూడండి : 'రసెల్ కంటే హార్దిక్​ మెరుగైన ఆల్​రౌండర్'

Last Updated : Dec 13, 2020, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.