ETV Bharat / sports

జట్టులోకి వస్తానని ముందే ఊహించా: దూబే

author img

By

Published : Oct 25, 2019, 12:24 PM IST

బంగ్లాదేశ్​తో జరగబోయే టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు యువ ఆల్​రౌండర్ శిమమ్ దూబే. అయితే జట్టులోకి వస్తానని ఎప్పుడో ఊహించానని అన్నాడీ క్రికెటర్.

దూబె

బంగ్లాదేశ్​తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్​కు ఎంపికయ్యాడు యువ క్రికెటర్ శివమ్ దూబే. దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటి, సెలక్టర్ల దృష్టిలో పడి.. భారత జట్టులో చోటు సంపాదించాడు. అయితే ఈ అవకాశం రావడానికి కోహ్లీ సహకారం ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు.

"సహజంగానే నాకు హిట్టింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. దానిపై మరింత సాధన చేశా. బ్యాటింగ్‌ దూకుడగా చేయాలని, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని మా నాన్న కోరుకున్నారు. పవర్‌ హిట్టింగ్‌ అంటే నాకిష్టం. టీమిండియాలో చోటు సంపాదించడం ఆనందంగా ఉంది. ఎంపికవుతానని ముందే ఊహించా. ఎందుకంటే నా ప్రదర్శనపై నాకు నమ్మకం ఉంది. క్రికెట్‌లో మెరుగయ్యేందుకు మరింత సాధన చేస్తా. ఆల్‌రౌండర్‌గా 100 శాతం ఏకాగ్రత, ఫిట్‌నెస్‌ నాకు అవసరం. ముంబయి అండర్‌-23 జట్టుకు ఎంపిక కానప్పుడు మా అన్నయ్య ఆర్థికంగా ఎంతో సహాయం చేశాడు. ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ అండగా నిలిచాడు. ఒత్తిడికి లోనైనా, ఏదైనా సమస్య తలెత్తినా కోహ్లీతో పంచుకునేవాడిని. అతడు నా సమస్యను అర్థం చేసుకుని సాయం చేసేవాడు"
-శివమ్ దూబే, టీమిండియా యువ ఆటగాడు

2018లో బరోడాతో రంజీ మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు దూబే. తర్వాత ఐపీఎల్​లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిని రూ.5 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇతడు మంచి పేసర్ కూడా. 16 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులాడిన శివమ్.. 1,012 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే వెస్టిండీస్‌-ఏ, దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన సిరీస్​ల్లో అద్భుతంగా రాణించాడు.

ఇవీ చూడండి.. రానా సరికొత్త పాత్ర.. 'హైదరాబాద్ ఎఫ్​సీ కో ఓనర్​'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Seoul – 25 October 2019
1. Various of Samsung Electronics Vice Chairman Lee Jae-yong leaving court
2. Various of Samsung's top officials, who also took part in the trial, leaving court
STORYLINE:
Samsung Electronics Vice Chairman Lee Jae-yong left court in the South Korean capital Seoul on Friday after the first session of his retrial on corruption charges.
The Supreme Court has sent back Lee's bribery case to the lower court for re-trial.
Lee has been facing charges of offering bribes to the disgraced South Korean president Park Geun-hye while she was in office.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.