కరోనా వల్ల 2022కు వాయిదా పడ్డ ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ ఆడటం భయంగా ఉందని తెలిపింది ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిసా హేలీ. దీంతోపాటు అదే ఏడాదిలో జరగనున్న టీ20 ప్రపంచకప్, బర్మింగ్‌హోమ్ కామన్వెల్త్ గేమ్స్, మహిళా యాషెస్‌లో కూడా పాల్గొనడం కష్టంగా ఉంటుందని చెప్పింది. ఒకే ఏడాదిలో ఈ నాలుగు మెగాటోర్నీలు జరగడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. అయితే వీటన్నింటినీ ఎదుర్కోవడం సవాల్‌గా భావిస్తానని వెల్లడించింది.
త్వరలోనే న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ జరగనుండటం సంతోషంగా ఉందని తెలిపింది అలిసా. ఇప్పటికే ఈ సిరీస్ కోసం 18 మందితో కూడిన బృందాన్ని బోర్డు సిద్ధం చేసినట్లు చెప్పింది.
ఇది చూడండి రోహిత్ శర్మకు బీసీసీఐ అభినందనలు