టర్నర్ మంచి ఆటగాడని బిగ్ బాష్ లీగ్‌లో తను సాధించిన పరుగులే అందుకు నిదర్శనమని ఆస్ట్రేలియా ఆటగాడు హాండ్స్‌కాంబ్ తెలిపాడు.
"నాలుగో వన్డేలో టర్నర్ ఆటతీరు అద్భుతం. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున మంచి ప్రదర్శన చేశాడు. మొహాలీ వన్డేలో టర్నర్ బంతిని బాదుతుంటే డ్రెస్సింగ్ రూంలో ఎంజాయ్ చేశాం. బుమ్రా బౌలింగ్‌లో ఆడిన షాట్లు ఆశ్చర్యానికి గురి చేశాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లో అసాధారణ ప్రతిభ కనబర్చాడు. ఈ మ్యాచ్ అతని కెరీర్‌ని మలుపు తిప్పుతుంది. ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేయడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడుతుంది".
హాండ్స్‌కాంబ్, ఆస్ట్రేలియా ఆటగాడు
నాలుగో వన్డేలో హాండ్స్‌కాంబ్ తన కెరీర్లో మొట్టమొదటి శతకం సాధించాడు. ఖవాజాతో కలిసి 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
"ఇది నా కెరీర్లోనే ఉత్తమ మ్యాచ్. గెలిచిన తీరు చాలా సంతోషాన్ని కలిగించింది. విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉంది. నేను, ఖవాజా సహజ శైలిలో ఆడటానికి ప్రయత్నించాం. మంచు కారణంగా కుల్దీప్, చాహల్ బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. వారు అద్భుతమైన బౌలర్లు. భారీ స్కోర్ ఛేదించడం ఎప్పుడూ ప్రత్యేకమే".
హాండ్స్‌కాంబ్, ఆస్ట్రేలియా ఆటగాడు