ETV Bharat / sports

'కోహ్లీ సారథ్యంలో ఆడాలని కలలు కన్నా'

ఇంగ్లాండ్​తో జరగనున్న టీ20 మ్యాచ్​లు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతతో వేచిచూస్తున్నట్లు తెలిపాడు ముంబయి ఆటగాడు సూర్యకుమార్​ యాదవ్. కెప్టెన్​ కోహ్లీ సారథ్యంలో ఆడటం తన కల అని తెలిపాడు. జట్టులో ఎంపికైన విషయం తెలిసినప్పడు ఎలా ఫీలయ్యాడో తెలిపాడు. ఇటీవలే ఇంగ్లాండ్​తో టీ-20 సిరీస్​ కోసం.. టీమ్​ఇండియాకు ఎంపికయ్యాడు సూర్య.

Suryakumar Yadav
'కోహ్లీ సారథ్యంలో ఆడాలని కలలు కన్నా'
author img

By

Published : Feb 27, 2021, 5:35 AM IST

ఇంగ్లాండ్​తో జరగనున్న 5 మ్యాచ్​ల టీ20 సిరీస్​ జట్టులో చోటు సంపాందించిన బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ ఆధ్వర్యంలో ఆడటం తన కల అని అన్నాడు. జట్టులో తనను ఎంపిక చేసినట్లు తెలియగానే భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపాడు.

"జట్టుకు ఎంపికైనట్లు తెలియగానే భావోద్వేగానికి గురయ్యా. గదిలో కూర్చుని సినిమా చూద్దామని అనుకునే సమయానికి.. ఫోన్​కు ఓ మెసేజ్ వచ్చింది. ఇంగ్లాండ్​తో జరగనున్న టీ20 సిరీస్​కు ఎంపికైనట్లు తెలిసింది. వెంటనే అమ్మ, నాన్న, భార్య, చెల్లికి వీడియో కాల్​ చేశా. ఈ వార్త చెప్పగానే అందరూ భావోద్వేగంతో ఏడవటం మొదలుపెట్టారు." అని సూర్యకుమార్​ చెప్పినట్లు బీసీసీఐ తెలిపింది.

''నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా నేనెప్పుడు జాతీయ జట్టుకు ఆడతానోనని కలల కన్నారు. అందులోనే జీవించారు. నాకెప్పుడూ అండగా ఉన్నారు. వాళ్లిప్పుడు సంతోషంగా ఉన్నందుకు.. నాకు ఆనందబాష్పాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ టీమ్​ఇండియాకు ఆడాలని కలలు కంటారు. కానీ.. ఇప్పుడు నాకు టైమొచ్చింది.''

- సూర్యకుమార్​ యాదవ్​.

ప్రతీ ఒక్కరూ టీమ్​ఇండియా తరఫున ఆడాలని అనుకుంటారని, ఇప్పుడు తన సమయం వచ్చిందని సూర్యకుమార్ అన్నాడు. విరాట్​ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని తెలిపాడు. కోహ్లీకి గెలవాలనే తపన ఎప్పుడూ ఉంటుందని, అదే తనకు ఆదర్శప్రాయమైందని అన్నాడు.

సూర్యకుమార్​ యాదవ్​తో పాటు.. రాహుల్​ తెవాతియా, ఇషాన్​ కిషన్​ కూడా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.

ఇదీ చదవండి:

ఫలించిన నిరీక్షణ- 'సూర్య' సునామీకి సిద్ధమా?

'ఈ ఏడాది టీ20 వరల్డ్​కప్ మనదే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.