ETV Bharat / sports

లాక్​డౌన్​ తర్వాత తొలి మ్యాచ్​.. ఆసక్తితో అభిమానులు - ఇంగ్లాండ్ వెస్టిండీస్ టెస్టు సిరీస్

క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడబోతుంది. రేపు (జులై8) ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభంకాబోతుంది. కరోనా మహమ్మారి కాలంలో జరగబోతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం వల్ల అందిరిలోనూ ఆసక్తి నెలకొంది.

విండీస్
విండీస్
author img

By

Published : Jul 6, 2020, 5:26 PM IST

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగకు రంగం సిద్ధమైంది. దేశంలో క్రీడలకు ఇంకాస్త సమయం ఉన్నా.. వేరే దేశాల మ్యాచ్​లతోనైనా కాలక్షేపం చేయాలనుకునే వారికి ఇది శుభవార్త. ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు రేపే (జులై 8) ప్రారంభం కాబోతుంది. లైవ్ మ్యాచ్​లో ఆటగాళ్ల ప్రదర్శన, మొబైల్​లో క్రికెట్ మ్యాచ్​ల స్కోర్స్ చూడక చాలా రోజులవుతున్న తరుణంలో ఈ మ్యాచ్​ అభిమానులకు కాస్త ఊరటనిచ్చేదే. ఈ మ్యాచ్​ కోసం రెండు జట్లు ఇప్పటికే ప్రణాళికలన్ని సిద్ధం చేసుకున్నాయి.

తొలి టెస్టు​ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే 13 మందితో జట్టును ప్రకటించింది. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో కెప్టెన్ జో రూట్ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు. ఈ కారణంగా ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్ సారథిగా వ్యవహరించనున్నాడు. జాసన్ హోల్డర్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు కూడా గెలుపుపై విశ్వాసంతో ఉంది. ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది కరీబియన్ క్రికెట్ బోర్డు.

జూన్ 9న ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన విండీస్ బృందం మూడు వారాల పాటు క్వారంటైన్​లో ఉంది. అనంతరం ఇంట్రా స్క్వాడ్​ ప్రాక్టీస్​ గేమ్​ల్లో పాల్గొంది. ఇంగ్లాండ్ జట్టు కూడా ఇంట్రా స్క్వాడ్​ ప్రాక్టీస్​ గేమ్​తో ఫామ్​లోకి వచ్చింది.

బ్లాక్ లివ్స్ మ్యాటర్ లోగో

అమెరికన్ ఆఫ్రికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల సంతాపం తెలిపేందుకు సిద్ధమయ్యారు ఇంగ్లాండ్-వెస్టిండీస్ ఆటగాళ్లు. ఇరుజట్ల ఆటగాళ్లు తమ జెర్సీపై బ్లాక్ లివ్స్ మ్యాటర్ లోగోను ధరించనున్నారు. మొత్తం మూడు మ్యాచ్​లు ఖాళీ మైదానాల్లో జరగనున్నాయి.

All you need to know about England vs West Indies Test series
బ్లాక్ లివ్స్ మ్యాటర్ లోగో

కరోనా కొత్త నియమాలు

కరోనా కారణంగా మ్యాచ్​ల నిర్వహణ కష్టతరంగా మారింది. అయినా క్రీడా టోర్నీలు నిర్వహించేందుకు కొన్ని దేశాలు సాహసం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐసీసీ కొన్ని నిబంధనలకు రూపకల్పన చేసింది. అందులో ముఖ్యమైనవి కొన్ని.

బంతిపై ఉమ్మి నిషేధం

కరోనా కారణంగా బంతిపై ఉమ్మిని రాయడాన్ని నిషేధించింది ఐసీసీ. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. బంతికి మెరుపు తీసుకొచ్చేందుకు ఇకపై బాల్​కు సలైవా రాయకూడదు. ఈ నిబంధనను అతిక్రమిస్తే రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత జట్టు పరుగుల్లో ఐదు రన్స్ కోత విధిస్తారు.

కరోనా సబ్​స్టిట్యూట్

ఈ సబ్​స్టిట్యూట్​ కేవలం టెస్టులకు మాత్రమే. ఒకవేళ ఏ ఆటగాడైనా కరోనా లక్షణాలతో బాధపడితే అతడికి బదులుగా మరో ఆటగాడిని తీసుకోవచ్చు.

లోకల్ అంపైర్లు

కరోనా దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణాలను అన్ని దేశాలు రద్దు చేశాయి. ఈ కారణంగా వేరే దేశాల అంపైర్లను మ్యాచ్​ కోసం నియమించడం కష్టంగా మారుతుంది. అందువల్ల ఐసీసీ ఎలీట్ ప్యానెల్​లోని ఆ దేశంలోని అంపైర్లకే బాధ్యతలు అప్పగించనున్నారు.

అదనపు డీఆర్​ఎస్

ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవశాలి అంపైర్లు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. అందువల్ల ఇన్నింగ్స్​కు ఒక అదనపు డీఆర్​ఎస్​ తీసుకోవచ్చు. అంటే వన్డేల్లో ఒకసారి సమీక్ష విఫలమైతే మరోసారి ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. టెస్టుల్లో అయితే మూడుసార్లు రివ్యూ తీసుకోవచ్చు.

ఇంగ్లాండ్​ జట్టు (తొలి మ్యాచ్)

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్, జాక్ క్రాలే, జో డేన్లీ, ఒల్లీ పోప్, జాస్ బట్లర్, డోమ్ సిబ్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

రిజర్వ్ బెంచ్

జేమ్స్ బ్రాసే, సామ్ కరన్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, సకిబ్ మహ్మద్, క్రేగ్ ఓవర్టన్, ఒల్లీ రాబిన్సన్, ఒల్లే స్టోన్, బెన్ ఫోక్స్

వెస్టిండీస్ జట్టు

జాసన్ హోల్డర్ (కెప్టెన్). బ్లాక్​వుడ్, బోనర్, క్రెగ్ బ్రాత్​వైట్, షమరా బ్రూక్స్, జాన్ క్యాంప్​బెల్, రోస్టన్ చేజ్, రకీమ్ కార్న్​వాల్, షేన్ డోవ్రిచ్, చెమర్ హోల్డర్, షై హోప్, అల్జారీ జోసెఫ్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్

రిజర్వ్ బెంచ్

సునీల్ ఆంబ్రోస్, జాషువా డిసిల్వా, షన్నాన్ గాబ్రియేల్, కియోన్ హోర్డింగ్, కేల్ మేయర్స్, ప్రెస్టన్ మెక్​స్వీన్, మర్కినో మిండ్లే, షేన్ మోస్లే, ఆండర్సన్ ఫిలిప్, ఒషానే థామస్, జోమెల్ వారికేన్

మ్యాచ్​ వేదిక, తేదీలు

తొలి టెస్టు : జులై 8-12, రోజ్ బౌల్, సౌతాంప్టన్

రెండో టెస్టు : జులై 16-20, ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

మూడో టెస్టు : జులై 24-28, ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

ప్రత్యక్ష ప్రసారం

ప్రతి మ్యాచ్​ మధ్యాహ్న 3.30గం (భారత కాలమాన ప్రకారం) ప్రారంభమవుతుంది. సోనీ సిక్స్, సోనీ లైవ్​లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.