పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ పదవి నుంచి మిస్బావుల్ హక్‌ను తప్పించాలని ఆ దేశ బోర్డు భావిస్తోంది. సీనియర్ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ను ఆ స్థానంలో నియమించాలని చూస్తోందని సమాచారం. ఇందుకోసం ప్లాన్ కూడా సిద్ధం చేసిందట. ఈ విషయాన్ని అక్తర్ స్వయంగా వెల్లడించాడు. బోర్డుకు తనకు మధ్య చర్చలు జరిగినట్లు తెలిపాడు. తుది నిర్ణయం మాత్రం పీసీబీ తనతో చెప్పలేదని అన్నాడు. అయితే పాక్ క్రికెట్లో కీలక పాత్ర పోషించేందుకు, ఈ పదవి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునట్లు చెప్పాడు అక్తర్. బాధ్యతను అప్పగిస్తే చక్కని ఫలితాన్ని చూపిస్తానని అన్నాడు.
ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌తో పాటు హెడ్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు మిస్బావుల్ హక్. ఇటీవల కాలంలో జట్టు ఘోరంగావ విఫలమవుతున్న నేపథ్యంలో ఆ పదవి నుంచి అతడిని తప్పించి అక్తర్‌కు నియమించాలని పీసీబీ అనుకుంటోంది.
ఇదీ చూడండి ఐపీఎల్2020: సన్‌రైజర్స్ బలాలు, బలహీనతలు ఇవే!