అజింక్య రహానే ఎట్టకేలకు తన బిడ్డను చూసే అవకాశం కలిగింది. తన సతీమణి రాధిక ధోపావ్కర్ శనివారం నాడు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాతో టెస్టు ఆడుతున్న రహానేకు తన కూతురును చూసే అవకాశం దొరకలేదు.
సోమవరాం తన కుమార్తెను చూసి.. బిడ్డతో దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు రహానే. ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ప్రస్తుతం ముంబయిలో ఉన్న రహానే అక్టోబరు 10న పుణె వేదికగా జరగనున్న రెండో టెస్టు కోసం జట్టుతో కలవనున్నాడు.
-
Hello ❤️ pic.twitter.com/25oQyXOQeV
— Ajinkya Rahane (@ajinkyarahane88) October 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hello ❤️ pic.twitter.com/25oQyXOQeV
— Ajinkya Rahane (@ajinkyarahane88) October 7, 2019Hello ❤️ pic.twitter.com/25oQyXOQeV
— Ajinkya Rahane (@ajinkyarahane88) October 7, 2019
తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక ధోపావ్కర్‌ను 2014లో వివాహం చేసుకున్నాడు. పాఠశాలలో కలుసుకున్న వీళ్లు అనంతరం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
విశాఖ టెస్టులో దక్షిణాఫ్రికాపై 203 పరుగులు భారీ విజయం సాధించింది భారత్. రహానే 15, 27* పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: సానియా సోదరితో అజారుద్దీన్ తనయుడి పెళ్లి