ETV Bharat / sports

'ఈసారి సన్​రైజర్స్ విజేతగా నిలుస్తుంది' - 'ఈసారి సన్​రైజర్స్ విజేతగా నిలుస్తుంది'

టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేయడం సంతృప్తినిచ్చిందని తెలిపాడు ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్ బెయిర్​స్టో. ఇంగ్లాండ్ తరఫున ఎక్కువ శతకాలు చేయడానికి ఇష్టపడతానని వెల్లడించాడు. అలాగే ఐపీఎల్​లో ఈసారి సన్​రైజర్స్​ విజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Bairstow
బెయిర్​స్టో
author img

By

Published : Mar 27, 2021, 12:22 PM IST

టీమ్ఇండియాతో జరుగుతోన్న వన్డే సిరీస్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్ జానీ బెయిర్​స్టో. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో సెంచరీ (112)తో అదరగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన ప్రదర్శన, ఐపీఎల్​లో సన్​రైజర్స్​కు ఆడటం గురించి స్పందించిన ఇతడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సన్​రైజర్స్​కు విజేతగా నిలిచే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు.

"ఐపీఎల్ అద్భుత టోర్నీ. ప్రతి ఒక్క అంతర్జాతీయ క్రికెటర్ ఇందులో పాల్గొనాలి అనుకుంటాడు. వచ్చే వారంలో నేను సన్​రైజర్స్ జట్టుతో కలుస్తా. గతేడాది మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. ఈ ఏడాది విజేతగా నిలిచేందుకు మాకు అవకాశం ఉందని అనుకుంటున్నా. కొందరు కొత్త ఆటగాళ్లతో జట్టు ఉత్సాహంతో ఉంది."

-బెయిర్​స్టో, ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్

అలాగే రెండో వన్డేలో సెంచరీ చేయడం పట్ల స్పందించాడు బెయిర్​స్టో. ఇంగ్లాండ్ తరఫున వన్డేల్లో మరిన్ని శతకాలు సాధించాలని ఉందని వెల్లడించాడు.

"ఇంగ్లాండ్ తరఫున ఎక్కువ సెంచరీలు చేయడం నాకిష్టం. ఓపెనర్​గా వచ్చినప్పటి నుంచి నా బ్యాటింగ్ తీరు సంతృప్తికరంగా ఉంది. నా గణాంకాల పట్ల సంతోషంగా ఉంది. కానీ ఈ సెంచరీలు జట్టు గెలుపు కోసం ఉపయోగపడకపోతే అవి వ్యర్థం. ప్రస్తుతం నా ఆటను ఎంజాయ్ చేస్తున్నా" అంటూ చెప్పుకొచ్చాడు బెయిర్​స్టో.

భారత్-ఇంగ్లాండ్ మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం జరగనుంది. ఇప్పటికే సిరీస్​లో 1-1తేడాతో సమానంగా ఉన్న ఇరుజట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.