గాయంతో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్‌ను తీసుకోగా.. వన్డే సిరీస్‌కు మాత్రం మయాంక్ అగర్వాల్‌కు అవకాశం కల్పించారు సెలక్టర్లు.
"శిఖర్ ధావన్ గాయం నుంచి నిదానంగా కోలుకుంటున్నాడు. పూర్తిగా నయం కావడానికి ఇంకా సమయం పడుతుందని మా వైద్యబృందం తెలిపింది. విండీస్‌తో వన్డే సిరీస్ కోసం అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవాలని సెలక్టర్లు సూచించారు." -బీసీసీఐ ప్రకటన
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. తొలి వన్డే చెన్నై వేదికగా డిసెంబరు 15న ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ విశాఖలో డిసెంబరు 18న జరగనుంది. మూడో వన్డే కటక్ వేదికగా డిసెంబరు 22న నిర్వహించనున్నారు. బుధవారం విండీస్‌తో నిర్ణయాత్మక చివరి టీ20 జరగనుంది.
ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో సిరీస్‌ల్లో మయాంక్ అద్భుతంగా ఆడాడు. ఈ కారణంగా అతడిని వన్డే సిరీస్‌లో తీసుకున్నారు. విజయ్‌శంకర్‌కు గాయంతో ప్రపంచకప్‌లోనే 15 మంది సభ్యుల్లో మయాంక్‌ను తీసుకోగా.. మ్యాచ్ ఆడే అవకాశం అతడికి రాలేదు. 28ఏళ్ల ఈ బెంగళూరు ఆటగాడు 9 టెస్టుల్లో 872 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్(కీపర్), శివమ్ దూబే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.
ఇదీ చదవండి: రనౌట్ వదిలేసిన బౌలర్‌పై ప్రశంసలు- ఎందుకు?