ETV Bharat / sports

కరోనా కారణంగా భారత్​-జింబాబ్వే సిరీస్ రద్దు - జింబాబ్వా పర్యటన రద్దు

కరోనా కారణంగా జింబాబ్వే పర్యటనను రద్దు చేసుకుంది బీసీసీఐ. ఆగస్టులో ఈ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది.

After SL tour postponement, BCCI calls off Zimbabwe trip
భారత్
author img

By

Published : Jun 12, 2020, 2:59 PM IST

కరోనా కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడుతుండగా బీసీసీఐ కూడా పర్యటనలను వాయిదా వేసుకుంటోంది. ఇప్పటికే జూన్-జులైలో జరగాల్సిన శ్రీలంక పర్యటనను ఆగస్టులో నిర్వహిస్తామని తెలిపింది. తాజాగా ఆగస్టులో జింబాబ్వేతో జరగాల్సిన వన్డే సిరీస్​ను రద్దు చేసింది.

"ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమ్​ఇండియా.. శ్రీలంక, జింబాబ్వేల్లో పర్యటించ లేదు. ఆటగాళ్లకు శిక్షణ కూడా ఇవ్వలేని సమయంలో పర్యటనను ఖరారు చేయలేం. త్వరలోనే క్రికెటర్లకు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం."

-జై షా, బీసీసీఐ సెక్రటరీ

టీమ్​ఇండియా శ్రీలంక పర్యటనను జూన్ 24 జరిగే మొదటి వన్డేతో ప్రారంభించాల్సి ఉంది. అలాగే ఆగస్టు 22న జింబాబ్వే సిరీస్​ షురూ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రెండు పర్యటనలు జరిగేలా లేవని బీసీసీఐ తేల్చిచెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.