ఆటోబయోగ్రఫీ 'గేమ్‌చేంజర్' విడుదలైన నాటి నుంచి వివాదాల చుట్టూ తిరుగుతున్నాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ అఫ్రిది. తాజాగా తన కూతుళ్లను బహిరంగ ప్రదేశాల్లో ఆటలాడనివ్వకుండా అడ్డుకుంటాడన్న వార్తలపై సమాధానమిచ్చాడు.
'నా పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆడే ఆటలను ఆడించను. సామాజిక , మతపరమైన కారణాల వల్లే అలాంటి నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంపై వాళ్ల అమ్మ మద్దతిచ్చింది. స్త్రీవాదులు వారికి నచ్చింది వాళ్లు మాట్లాడతారు. కాని ఒక సంప్రదాయాలున్న పాకిస్థానీయుడిగా నా నిర్ణయం నాది'.
-- అఫ్రిది, పాక్ మాజీ ఆటగాడు
10 నుంచి 20 సంవత్సరాల లోపు వయసు వాళ్లైన తన నలుగురు కూతుళ్లను.. బయటకు పంపకుండా వారి స్వేచ్ఛను అడ్డుకుంటున్నాడని సామాజిక మాధ్యమాల్లో అఫ్రిదిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. స్త్రీ వ్యతిరేకి, చాదస్తవాదిగా దుమ్మెత్తిపోశారు నెటిజన్లు. ఫుట్‌బాల్ స్టార్, ముస్లిం ఆటగాడు లివర్‌పూల్‌కు చెందిన సూపర్‌స్టార్ మెహహ్మద్ సలాను చూసి ఈ విషయంలో చాలా నేర్చుకోవాలి అంటూ సూచించారు. ఇటీవల సలా కూతురు 'మక్కా' ఫుట్‌బాల్ స్టేడియంలో అందరూ చూస్తుండగా గోల్ చేయడం.. సలా భావోద్వేగంగా చూడటం చూపరులను ఆకట్టుకుంది.
-
This is great. Mo Salah’s daughter wanted to score a goal at Anfield after her dad won the Golden Boot pic.twitter.com/WBsWbsDOcm
— Tim Callanan (@MrTimCallanan) May 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is great. Mo Salah’s daughter wanted to score a goal at Anfield after her dad won the Golden Boot pic.twitter.com/WBsWbsDOcm
— Tim Callanan (@MrTimCallanan) May 12, 2019This is great. Mo Salah’s daughter wanted to score a goal at Anfield after her dad won the Golden Boot pic.twitter.com/WBsWbsDOcm
— Tim Callanan (@MrTimCallanan) May 12, 2019
తాజాగా సలాను చూసి నేర్చుకోవాలన్న సూచనపైనా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు అఫ్రిది.
'ప్రజా జీవితంలో ఎవరి నిర్ణయాలకు నేను వ్యతిరేకం కాదు. కానీ నేను నా పిల్లలతో వ్యవహరించినట్లుగానే అందరూ ఉండాలని కోరుకుంటా. నా కూతుళ్లను, అందరి పిల్లల్నీ, మహిళల్నీ దేవుడు దీవించాలి' అంటూ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు అఫ్రిది.
-
I don't judge anyone for what they do or meddle in people's life. I expect the same too from others. May Allah bless my daughters and daughters/women all over the world! Let people be. @fifiharoon @Independent
— Shahid Afridi (@SAfridiOfficial) May 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I don't judge anyone for what they do or meddle in people's life. I expect the same too from others. May Allah bless my daughters and daughters/women all over the world! Let people be. @fifiharoon @Independent
— Shahid Afridi (@SAfridiOfficial) May 12, 2019I don't judge anyone for what they do or meddle in people's life. I expect the same too from others. May Allah bless my daughters and daughters/women all over the world! Let people be. @fifiharoon @Independent
— Shahid Afridi (@SAfridiOfficial) May 12, 2019