టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసాధారణ క్రికెట్ షాట్లు ఆడుతున్న ఓ చిన్న పిల్లాడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో ఎడమ చేతివాటం కలిగిన ఆ బుడతడు.. మెట్లపై బ్యాట్ పట్టుకుని ఓపెన్ స్టాండింగ్‌లో నిలబడి వచ్చిన బంతిని వచ్చినట్లే బాదుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న ఆకాశ్.. అతని బ్యాటింగ్ ప్రతిభను చూసి ప్రశంసించాడు. పిల్లాడు ఒక్కో బంతిపై విరుచుకుపడుతుంటే.. అందుకు అనుగుణంగా కామెంటరీ ఇచ్చాడు ఆకాశ్.
- View this post on Instagram
How good is this young kid!!! #talented #aakashvani #feelitreelit #feelkaro
">
ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంత మంది ఆ పిల్లాడిని కింగ్స్ ఎలెవెన్ పంజాక్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో పోల్చగా.. మరికొందరు 2007 ప్రారంభ ప్రపంచ టీ20లో యువరాజ్ సింగ్ బాదిన సిక్సర్లను గుర్తు చేసుకున్నారు.
తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆకాశ్.. ఎక్కడైనా చిన్న పిల్లలు అద్భుతమైన క్రికెట్ నైపుణ్యాలను కనబరిస్తే వాటిని షేర్ చేస్తుంటాడు. ఆ వీడియోకు తన కామెంటరీనీ జోడించి.. వీక్షకులకు మరింత ఆసక్తికరంగా మారుస్తాడు.